రూ. 442 కోట్ల రుణాలకు చెక్
ముంబై: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ తాజాగా గ్లోబల్ ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్, ఫైనాన్సింగ్ సంస్థ కార్లయిల్ ఏవియేషన్ పార్ట్‌నర్స్(సీఏపీ)కు ఈక్విటీ షేర్లను కేటాయించింది. తద్వారా బ్యాలన్స్‌షిట్ నుంచి 50 మిలియన్ డాలర్ల లయబిలిటీల(రూ. 442 కోట్ల రుణాలు)ను తగ్గించుకుంది. అంతేకాకుండా తాజా నిధులతో దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి దారి ఏర్పాటు చేసుకోనుంది. 121.18 మిలియన్ డాలర్ల లీజ్ బకాయిల పునర్వ్యవస్థీకరణకు సీఏపీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సెపె్టంబర్ 11న కంపెనీ ప్రకటించింది. దీంతో 89.5 మిలియన్ డాలర్ల లిక్విడిటీకి వీలున్నట్లు తెలియజేసింది.
తద్వారా పునర్వ్యవస్థీకరణ చర్యల కొనసాగింపునకు మద్దతు లభించనున్నట్లు పేర్కొంది. కాగా.. కంపెనీ బోర్డు అలాట్‌మెంట్ కమిటీ షేరుకి రూ. 42.32 ధరలో నాన్‌ప్రమోటర్ కేటగిరీలో ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన 10,41,72,634 షేర్ల జారీకి తాజాగా ఆమోదముద్ర వేసినట్లు స్పైస్‌జెట్ వెల్లడించింది. అంతేకాకుండా 79.6 మిలియన్ డాలర్ల నగదు మెయింటెనెన్స్ రిజర్వులకు ఒప్పందం వీలు కలి్పంచనుంది. భవిష్యత్‌లో ఎయిర్‌క్రాఫ్ట్, ఇంజిన్‌ల నిర్వహణకు వీటిని వినియోగించనుంది. మరో 9.9 మిలియన్ డాలర్లు లీజ్ ఆబ్లిగేషన్లకుగాను నగదు నిర్వహణా క్రెడిట్స్‌గా పొందనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జూలై–సెపె్టంబర్)లో స్పైస్‌జెట్ నికర నష్టం భారీగా పెరిగి రూ. 635 కోట్లను తాకిన విషయం విదితమే.
బీఎస్‌ఈలో స్పైస్‌జెట్ షేరు దాదాపు యథాతథంగా రూ. 37 వద్ద ముగిసింది.


