
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ (SpiceJet) తాజాగా ఇరాక్‌లోని నజాఫ్‌కి నాన్‌స్టాప్ ఫ్లైట్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ముంబై-నజాఫ్ రూట్‌లో 2025 అక్టోబర్ 18 నుంచి, అహ్మదాబాద్ రూట్‌లో 19 నుంచి సర్వీసులు మొదలవుతాయని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు కీలక ఆధ్యాత్మిక కేంద్రాల్లో నజాఫ్ కూడా ఒకటి. కొత్త విమానాలను సమకూర్చుకోవడం సహా దేశ, విదేశ రూట్లలో మరిన్ని రూట్లకు విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు స్పైస్‌జెట్ వివరించింది. ఈ సర్వీసులు ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ఇదీ చదవండి: దీపావళికి.. ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ గిఫ్ట్