బ్రిటిష్ ఎయిర్‌వేస్, అబుదాబీ విమానాలకు బెదిరింపు ఈ–మెయిల్స్
శంషాబాద్: బాంబు బెదిరింపు ఈ–మెయిల్స్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం రేపాయి. శుక్రవారం తెల్లవారు జామున ఆర్‌జీఐఏ కస్టమర్ సపోర్ట్‌కు రెండు నిమిషాల తేడాలోనే రెండు ఈ–మెయిల్స్ వచ్చాయి. 2.15 గంటలకు వచి్చన ఈ మెయిల్‌లో మరికొద్ది గంటల్లో ల్యాండ్ కానున్న బ్రిటిష్ అబుదాబీ నుంచి వస్తున్న ఇండిగో 6ఈ–1408 విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యే సమయంలో పేల్చివేయనున్నట్లు పేర్కొన్నారు.
2.17 గంటలకు వచ్చిన మరో మెయి ల్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కానున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానాన్ని బాంబుతో పేల్చివేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఎయిర్‌పోర్టు భద్రతాధికారులు వెంటనే బీటీఏసీ (బాంబ్ థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీ) ఏర్పాటు చేసి ఎయిర్‌పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు అన్ని ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలించారు. అబుదాబీ నుంచి వచ్చే విమానాన్ని ముంబై ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం నిర్దిష్ట సమయానికి ఉదయం 5.18 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. అధికారులు విమానాన్ని పూర్తిగా పరిశీలించారు.


