పలు విమానాల రద్దు | Volcanic Eruption In Ethiopia Disrupts Air Travel In India, More Details Inside | Sakshi
Sakshi News home page

పలు విమానాల రద్దు

Nov 25 2025 7:44 AM | Updated on Nov 25 2025 12:39 PM

Volcanic Eruption in Ethiopia Disrupts Air Travel in India

ఇథియోఫియాలో బద్ధలైన భారీ అగ్నిపర్వతం బూడిద,  దుమ్ము కణాలు వాయువ్య భారతాన్ని చేరాయి. దీంతో ఆకాశమార్గంలో పెద్దఎత్తున పొగవ్యాపించి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో కేంద్ర విమానయాన శాఖ వెంటనే అప్రమత్తమైంది. ఆ మార్గంలో ప్రయాణించే కొన్ని విమానాలను రద్దు చేసింది.  

ఇథియోఫియాలోని హైలీ అగ్నిపర్వతం భారీ విస్పోటనం చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆ అగ్నిప్రమాదం యెుక్క విస్పోటనం ప్రభావం ఇప్పుడు భారత్ పై పడింది. నిన్న సాయంత్రం 6గంటల 30 నిమిషాల ప్రాంతంలో గాలిలో బూడిద అంతా అల్లుకొని గాలిలో పొగమేగంలా భారత్ లో వ్యాపించింది. భూతలం నుంచి 10 కిలోమీటర్లకు పైగా ఎత్తులో దాదాపు 100-120 కి.మీ వేగంతో ప్రయాణించిన ఈ దుమ్ము,దూళి కణాలు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ పంజాబ్ ల మీదుగా ప్రయాణించడంతో ఆకాశంలో  విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో 6 విమానాలను రద్దు చేసింది. అకారా ఎయిర్ లైన్స్ జెడ్డా, కువైట్, అబుదాబీలకు ప్లైట్ సేవలను రద్దు చేసింది. డీజీసీఏ అగ్రిపర్వత బూడిద హెచ్చరికలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ పాకిస్థాన్ మీదుగా విమానాలను మళ్లిస్తున్నాయి. కానీ భారత్ మాత్రం ఆ మార్గం ఉపయోగించడం లేదు. కనుక విమానాలను డిలే చేయడమే లేదా రద్దు చేయడమో చేస్తుంది.

కాగా ఈ అగ్నిపర్వత బూడిద ఎఫెక్ట్ భూ ఉపరితలాన్ని ప్రభావితం చేసే అవకాశాలు లేవని ఐఏండీ అధికారులు తెలిపారు. అగ్నిపర్వత బూడిద 10-15 కిలోమీటర్ల ఎత్తున వెళుతున్నందున్న గాలి నాణ్యతకు అధిక హాని ఏర్పడే అవకాశాలు లేవన్నారు. అయితే ఉష్ణోగ్రతలు క్షీణించి ఆకాశం మబ్బుగా ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement