
కోటీశ్వరులవ్వాలనే కల అందరికీ ఉంటుంది. అయితే కోటీశ్వరులవ్వడం ఎలా అని మాత్రం చాలామందికి తెలియకపోవచ్చు. సరైన ఆర్థిక ప్రణాళిక, సరైన పెట్టుబడి ఎవ్వరినైనా కోటీశ్వరులను చేస్తుంది. ఈక్విటీ షేర్లు లేదా బంగారం వంటి వాటిలో పెట్టె పెట్టుబడి తప్పకుండా ధనవంతులను చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదేలాగో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
మీరు నెలకు కేవలం రూ. 35,000 పెట్టుబడి పెడితే.. కోటీశ్వరులవుతారు. మీరు పెట్టే పెట్టుబడిన బంగారం, స్టాక్ మార్కెట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ (PPF) వంటి వాటిలో కొంత, కొంత విభజించి ఇన్వెస్ట్ చేయాలి. ఎలా అంటే.. మ్యూచువల్ ఫండ్స్‌లో రూ. 20000, బంగారంపై రూ. 10000, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో రూ. 5 వేలుగా విభజించి పెట్టుబడి పెట్టాలి.
మ్యూచువల్ ఫండ్
●నెలవారీ ఇన్వెస్ట్‌మెంట్: రూ. 20,000
●కాల వ్యవధి: 12 సంవత్సరాలు
●అంచనా వేసిన రిటర్న్స్: సంవత్సరానికి 12 శాతం
●పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ. 28,80,000
●ఎస్టిమేటెడ్ రిటర్న్స్: రూ. 35,65,043
●మొత్తం విలువ: రూ. 64,45,043
బంగారంపై పెట్టుబడి
●నెలవారీ పెట్టుబడి: రూ. 10,000
●కాల వ్యవధి: 12 సంవత్సరాలు
●అంచనా వేసిన రాబడి: సంవత్సరానికి 10 శాతం
●పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ. 14,40,000
●ఎస్టిమేటెడ్ రిటర్న్స్: రూ. 13,47,415
●మొత్తం విలువ: రూ. 27,87,415
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
●నెలవారీ: రూ. 5,000
●కాల వ్యవధి: 15 సంవత్సరాలు
●అంచనా వేసిన రాబడి: 7.1 శాతం
●పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ. 9,00,000
●ఎస్టిమేటెడ్ రిటర్న్స్: రూ. 7,08,120
●మొత్తం విలువ: రూ. 16,08,120
ఇప్పుడు మీకు వచ్చిన మొత్తం కలిపితే రూ. 64,45,043 (మ్యూచువల్ ఫండ్) + రూ. 27,87,415 (బంగారం) + రూ. 16,08,120 (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్)= రూ. 1,08,40,578 అవుతుంది. ఇది కేవలం అంచనా మాత్రమే. వడ్డీ శాతం పెరిగితే ఇంకా ఎక్కువ మొత్తంలో లాభాలను పొందే అవకాశం కూడా ఉంటుంది.
NOTE: పెట్టుబడి పెట్టడం అనేది మీ సొంత నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా పెట్టుబడి పెట్టడానికి ముందు.. పెట్టుబడులను గురించి తెలుసుకోవడానికి, తప్పకుండా ఆర్ధిక నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికీ భారీ లాభాలు వస్తాయని చెప్పలేము. కొన్ని సార్లు కొంత నష్టాన్ని కూడా చవిచూడాల్సి ఉంటుంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండాలి.