దూసుకెళ్తున్న 5జీ నెట్‌వర్క్‌, 20 మిలియన్లకు చేరిన యూజర‍్లు..కారణం ఐఫోన్‌, మడత ఫోన్‌లే

South Korea 5g Users Reached 20 Million Sasy Reports - Sakshi

1980 సంవత్సంరలో 1జీ(జనరేషన్‌)ను వాయిస్‌ కాల్స్‌ మాత్రమే చేసుకునే సదుపాయం ఉంది. 

1990 సంవత్సరంలో 2జీ - ఈ ఫోన్‌లో ఫోన్ కాల్స్‌, మెసేజ్‌లు పంపేవాళ్లం. 

2000 సంవత్సరంలో 3జీ - మొబైల్‌లో ఇంటర్నెట్‌ను వినియోగించడం ప్రారంభించాం. 

2010 సంవత్సరంలో 4జీ- ఈ 4జీతో మొబైల్‌ డేటా వినియోగం పెరిగింది. అధిక సంఖ్యలో ఉన్న డేటాను పంపడంతో పాటు ఎంటర్‌టైన్మెంట్‌ కోసం వినియోగించే వాళ్లం. 

2020 సంవత్సరంలో 5జీ - ఈ 5జీ నెట్‌ వర్క్‌ ఏకకాలంలో మరిన్ని డివైజ్‌లను మొబైల్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయడం, అప్‌లోడ్, డౌన్‌లోడ్ స్పీడ్‌ వేగం పెరగడంతోపాటు స్మార్ట్ గ్లాస్ మీద ఆగ్‌మెంటెడ్ రియాలిటీ, మొబైల్ వర్చువల్ రియాలిటీ, హై క్వాలిటీ వీడియో, నగరాల్ని మరింత స్మార్ట్‌గా చేసే ఇంటర్నెట్ ఆఫ్‌ థింగ్స్..ఇవన్నీ సాధ్యమవుతాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ 5జీ నెట్‌ వర్క్‌ను వినియోగించుకునేందుకు పోటీపడుతున్నాయి. అయితే మిగిలిన దేశాలన్నింటిలో సౌత్‌ కొరియా  5జీ నెట్‌ వర్క్‌ వినియోగంలో ముందంజలో ఉన్నట్లు తేలింది. 

ఇటీవల సౌత్‌ కొరియా సైన్స్ అండ్‌ ఐసీటీ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం..నవంబర్‌ నెల నాటికి 5జీ మొబైల్‌ నెట్‌ వర్క్‌ యూజర్లు 20.19మిలియన్లకు చేరారు. 5జీ నెట్‌ వర్క్‌ను కమర్షియలైజ్‌ చేసిన 2019 నుంచి ఈ స్థాయిలో 5జీ యూజర్లు పెరగడం ఇదే తొలిసారి అని రిపోర్ట్‌ హైలెట్‌ చేసింది. దేశం మొత్తంలో 72.57 మిలియన్ల మొబైల్ యూజర్లు ఉండగా వారిలో  28 శాతం మంది 5జీ నెట్‌ వర్క్‌ను వాడుతున్నట్లు రిపోర్ట్‌ లో పేర్కొన్నాయి. 

85 నగరాల్లో 5జీ నెట్‌ వర్క్‌
52 మిలియన్ల జనాభా కలిగిన సౌత్‌ కొరియా, 2019, ఏప్రిల్‌లో తొలిసారి 5G నెట్‌వర్క్‌లను వాణిజ్య పరంగా వినియోగించేలా అనుమతులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆదేశానికి చెందిన 85 నగరాల్లో 5జీ నెట్‌ వర్క్‌ను అందిస్తుంది. తాజా డేటా ప్రకారం..అక్టోబర్‌లో 19.38 మిలియన్ల 5జీ సబ్‌స్క్రిప్షన్‌ల పెరిగాయి. అందుకు కారణం 5జీ స్మార్ట్‌ ఫోన్‌లు మార్కెట్‌లో విడుదల కావడంతో యూజర్ల సంఖ్య పెరిగినట్లు యోన్‌హాప్ వార్తా సంస్థ నివేదించింది.

5జీ స్మార్ట్‌ ఫోన్‌లలో 


శాంసంగ్‌ సంస్థ గతేడాది ఆగస్ట్‌లో కొత్త ఫోల్డబుల్ ఫోన్‌లు గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 3, గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 3 స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేసింది. విడుదలైన ఫోల్డబుల్‌ ఫోన్‌(మడత)లు యూజర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఆ ఫోన్ల  అమ్మకాలు ప్రారంభించిన 39 రోజుల్లోనే 1 మిలియన్ల ఫోన్‌లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో 5జీ నెట్‌ వర్క్‌ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. 

చదవండి:జస్ట్‌ మూడేళ్ల కంపెనీ..! 5జీ స్మార్ట్‌ఫోన్స్‌లో దిగ్గజ కంపెనీలకు గట్టిపోటీ.!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top