5జీ నెట్​వర్క్ అదుర్స్‌, రాకెట్‌ వేగంతో దూసుకెళ్తున్న యూజర్లు

Ericsson Report Says Indian Users Will Have 500 Million 5g Subscribers By 2027 - Sakshi

న్యూఢిల్లీ: మొబైల్‌ చందాదార్ల విషయంలో 5జీ టెక్నాలజీ చరిత్ర సృష్టించనుంది. భారత్‌లో 5జీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2027 నాటికి 50 కోట్లకు చేరుకుంటుంది. మొత్తం మొబైల్‌ చందాదార్లలో ఇది 39 శాతం వాటా అని టెలికం గేర్‌ మేకర్‌ ఎరిక్సన్‌ వెల్లడించింది.

‘స్మార్ట్‌ఫోన్‌ వినియోగదార్ల సంఖ్య ఈ ఏడాది డిసెంబర్‌కల్లా 81 కోట్లుగా ఉంటుంది. ఆరేళ్లలో ఇది 120 కోట్లకు ఎగుస్తుందని అంచనా. 4జీ యూజర్లు 79 కోట్ల నుంచి 71 కోట్లకు వచ్చి చేరుతుంది. 4జీ చందాదార్ల వాటా ప్రస్తుతం ఉన్న 68 నుంచి 55 శాతానికి పడిపోతుంది. అంతర్జాతీయంగా మొత్తం చందాదార్లలో 5జీ యూజర్ల సంఖ్య సుమారు 50 శాతానికి చేరుతుంది. స్మార్ట్‌ఫోన్‌ వినియోగదార్లలో 62 శాతం వాటా వీరిదే. 

చైనా, ఉత్తర అమెరికా నుంచి అంచనాలను మించి డిమాండ్‌ పెరగడమే ఈ వృద్ధికి కారణం. 2011 నుంచి మొబైల్‌ డేటా ట్రాఫిక్‌ 300 రెట్లు అధికమైంది. 2021 చివరినాటికి 200 కోట్లకుపైగా ప్రజలకు 5జీ నెట్‌వర్క్‌ చేరువ అవుతుంది. మొత్తం మొబైల్‌ నెట్‌వర్క్‌ డేటా ట్రాఫిక్‌ 2027 చివరికి 370 ఎక్సాబైట్స్‌ నమోదు కానుంది’ అని ఎరిక్సన్‌ తెలిపింది.

చదవండి: భారత్‌లో ఎక్కువగా కొంటున్న 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ఇదే..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top