breaking news
Indian users
-
మీ పుట్టిన తేదీ వివరాలు చెప్పండి!
న్యూఢిల్లీ: దేశీ వినియోగదారుల వయసును నిర్ధారించుకునేందుకు సోషల్ మెసేజింగ్ అప్లికేషన్ ‘వాట్సప్’ కొత్త కొత్త పద్ధతులను అన్వేషిస్తోంది. కొన్నింటిని పరీక్షిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచి్చన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టానికి అనుగుణంగా వాట్సప్ ఈ చర్య చేపట్టిన్టు తెలుస్తోంది. ‘‘మీ పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయండి’’అన్న సమాచారంతో వచి్చన వాట్సప్ మెసేజీలను కొందరు ‘ఎక్స్’లో పోస్ట్ చేయగా దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ‘‘త్వరలో అమల్లోకి రానున్న భారతీయ చట్టాలు మీ వయసును అడుగుతున్నాయి’’అని కూడా వాట్సప్ తన సందేశంలో చెబుతోంది. అయితే ప్రస్తుతానికి ఇది ఐచ్చికమైన విషయం మాత్రమేనని, వయసు నిర్ధారణ చేస్తేనే వాట్సప్ వాడవచ్చు అన్న నిబంధన ఏదీ లేదని వాట్సప్ సంస్థ మంగళవారం తెలిపింది.నిర్ధారణ అయిన వయసును ఇతర ప్లాట్‌ఫామ్‌లతో పంచుకోబోమని స్పష్టం చేసింది. వయసు నిర్ధారణ పరీక్షలు వాట్సప్ పనితీరుపై ఎలాంటి ప్రభావమూ చూపవని కూడా తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఐటీ కార్యదర్శి ఎస్.కృష్ణన్ కూడా మంగళవారం వాట్సప్ సందేశాలను గమనించి.. ‘‘బహుశా రానున్న డీపీడీపీ చట్టానికి సంబంధించినది అయి ఉంటుందని చెప్పడం గమనార్హం. ఇందుకు సంబంధించిన తుది గడువు దగ్గరపడుతోంది కాబట్టి విషయం ఏమిటన్నది వారి ద్వారా కూడా తెలుసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. డిజిటల్ రూపంలో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని చట్టపరమైన అంశాల విషయంలో వాడేందుకు, వ్యక్తుల హక్కులకు మధ్య సమతౌల్యత పాటించేందుకు కేంద్ర ప్రభుత్వపు డీపీడీపీ చట్టం ఉపయోగపడుతంది.పద్దెనిమిది ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిని ఈ చట్టం కింద పిల్లలుగా పరిగణిస్తున్నారు. వీరి సమాచారం విషయంలో ఎలా నడుచుకోవాలన్న విషయమైన చట్టంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. చట్టం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే సమయానికి పిల్లలు వాట్సప్ వాడేందుకు తల్లిదండ్రులు లేదా సంరక్షకుడి అనుమతితోనే వారి వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేయాలి. ఇందుకు తగ్గ సాంకేతిక, వ్యవస్థాగతమైన ఏర్పాట్లను ప్లాట్‌ఫామ్స్ సిద్ధంగా ఉంచాలి. పిల్లల సమాచారాన్ని వారికి హాని కలిగించే విషయాలకు వాడకూడదు. ప్లాట్‌ఫామ్‌లు పిల్లల ప్రవర్తనను గమనించే ఎలాంటి ఏర్పాట్లూ చేయకూడదు.వారిని దృష్టిలో ఉంచుకుని ప్రకటనలు గుప్పించడమూ నేరమే. చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకపోతే భారీ స్థాయి జరిమానాలు పడే అవకాశముంది. అనుమతికి సంబంధించిన నిబంధనలు వచ్చే ఏడాది మే నాటికి అమల్లోకి రావచ్చునని నిపుణులు భావిస్తున్నారు. అయితే దీనికి ఇంకా తొమ్మిది నెలలు గడువు ఉన్నప్పటికీ వాట్సప్ వంటి ప్లాట్‌ఫామ్స్ ఇప్పటి నుంచే వాటి అమలుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే వాట్సప్ ఇటీవల ప్రకటించి వాయిదా వేసిన యూజర్‌నేమ్ ఫీచర్ విషయమై వాట్పప్కు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఒక నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ విషయంలో తదుపరి చర్యలు ఏమిటన్న ప్రశ్నకు ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ సమాధానమిస్తూ.. ‘‘ఈ అంశం వాట్సప్‌తోపాటు అన్ని మెసేజింగ్ అప్లికేషన్లకూ వర్తిస్తుంది. దీంట్లో రెండు విషయాలున్నాయి. యూజర్‌నేమ్ ఫీచర్ వల్ల ఇతరులను కాపీ కొట్టే అవకాశం. రెండోది ప్రైవసీ. ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకోవాలి’’అన్నారు. ప్లాట్‌ఫామ్స్ ఈ విషయంలో ఏమనుకుంటున్నాయో తెలుసుకున్న తరువాత అందరికీ ప్రామాణికమైన మార్గదర్శకాలు జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. -
5జీ నెట్వర్క్ అదుర్స్, రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న యూజర్లు
న్యూఢిల్లీ: మొబైల్ చందాదార్ల విషయంలో 5జీ టెక్నాలజీ చరిత్ర సృష్టించనుంది. భారత్‌లో 5జీ సబ్స్క్రైబర్ల సంఖ్య 2027 నాటికి 50 కోట్లకు చేరుకుంటుంది. మొత్తం మొబైల్ చందాదార్లలో ఇది 39 శాతం వాటా అని టెలికం గేర్ మేకర్ ఎరిక్సన్ వెల్లడించింది. ‘స్మార్ట్‌ఫోన్ వినియోగదార్ల సంఖ్య ఈ ఏడాది డిసెంబర్‌కల్లా 81 కోట్లుగా ఉంటుంది. ఆరేళ్లలో ఇది 120 కోట్లకు ఎగుస్తుందని అంచనా. 4జీ యూజర్లు 79 కోట్ల నుంచి 71 కోట్లకు వచ్చి చేరుతుంది. 4జీ చందాదార్ల వాటా ప్రస్తుతం ఉన్న 68 నుంచి 55 శాతానికి పడిపోతుంది. అంతర్జాతీయంగా మొత్తం చందాదార్లలో 5జీ యూజర్ల సంఖ్య సుమారు 50 శాతానికి చేరుతుంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదార్లలో 62 శాతం వాటా వీరిదే. చైనా, ఉత్తర అమెరికా నుంచి అంచనాలను మించి డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి కారణం. 2011 నుంచి మొబైల్ డేటా ట్రాఫిక్ 300 రెట్లు అధికమైంది. 2021 చివరినాటికి 200 కోట్లకుపైగా ప్రజలకు 5జీ నెట్వర్క్ చేరువ అవుతుంది. మొత్తం మొబైల్ నెట్వర్క్ డేటా ట్రాఫిక్ 2027 చివరికి 370 ఎక్సాబైట్స్ నమోదు కానుంది’ అని ఎరిక్సన్ తెలిపింది. చదవండి: భారత్‌లో ఎక్కువగా కొంటున్న 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే..! -
ఫేస్బుక్ డాటా లీక్.. రంగంలోకి కేంద్రం!
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్ వినియోగదారుల సమాచారం దుర్వినియోగమవుతుందన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. డాటా లీక్‌పై సమాచారం ఇవ్వాలని, ఏప్రిల్ 7లోగా పూర్తి సమాచారాన్ని తమకు అందించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఫేస్‌బుక్‌ను కోరింది. కేంబ్రిడ్జ్ అనాలిటికా సంస్థ ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని తస్కరించి ఎన్నికలతోపాటు ఇతర ప్రయోజనాలకు వాడుకున్నట్టు వెలుగుచూడటం దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ నుంచి ఈ మేరకు సంజాయిషీ కోరుతూ కేంద్ర సమాచార, ప్రసారశాఖ లేఖ రాసింది. ఎన్నికలను ప్రభావితం చేసేలా ఫేస్బుక్ సమాచారాన్ని తస్కరించి.. అవకతవకలకు పాల్పడ్డట్టూ కేంబ్రిడ్జ్ అనాలిటికా (సీఏ) ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ సంస్థకు కూడా కేంద్రం ఈ నెల 23న నోటీసులు పంపింది. ఫేస్బుక్ నుంచి సమాచార ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలని కోరింది. భారతీయ ఓటర్లు, భారతీయ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం విషయంలో సీఏ ఏమైనా ఉల్లంఘనలకు, అవకతవకలకు పాల్పడిందా? ఫేస్బుక్ లేదా దాని అనుబంధ సంస్థలు ఫేస్బుక్ సమాచారాన్ని ఉపయోగించుకొని గతంలో భారత ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాయా? అన్నది తెలుపాలని కోరింది. ఫేస్బుక్ సమాచార ఉల్లంఘనలపై మరింత వివరాలు తెలుసుకోవాల్సిన అవసరముందని, అందుకే తాము ఫేస్‌బుక్‌కు ఈ మేరకు లేఖలు పంపామని కేంద్ర సమాచార శాఖ తెలిపింది. -
లైకోస్, అపోలో ఇంటర్నేషనల్‌ల ఈ-కామర్స్ వెంచర్
హైదరాబాద్: ఇంటర్నెట్ బ్రాండ్ లైకోస్, అపోలో ఇంటర్నేషనల్ సంస్థలు ఈ-కామర్స్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. అపోలో లైకోస్ నెట్కామర్స్ పేరుతో ఈ జాయింట్ వెంచర్ ఏర్పాటవుతోంది. భారత వినియోగదారులు లక్ష్యంగా కస్టమ్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్స్ ఏర్పాటు చేయడానికి గ్లోబల్ బ్రాండ్స్‌కు ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్స్ ఈ వెంచర్ అంది స్తుంది. భారత వినియోగదారులకు వినూత్నమైన డిజిటల్ షాపింగ్ అనుభూతిని ఈ జాయిం ట్ వెంచర్ ద్వారా అందుబాటులోకి తెస్తామని అపోలో వైస్-చైర్మన్, ఎండీ రాజా కన్వర్ చెప్పారు. అంతర్జాతీయ దిగ్గజం బ్రాండ్లు భారత్‌లోకి ప్రవేశించడానికి వినూత్నమైన సర్వీసులందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని లైకోస్ చైర్మన్, సీఈఓ సురేశ్ రెడ్డి చెప్పారు.


