రియల్‌మీ నుంచి వాషింగ్‌ మెషిన్‌.. వచ్చేది ఎప్పుడంటే?

Smartphone Company Realme Planning To Launch Washing Machine - Sakshi

స్మార్ట్‌ఫోన్‌ తయారీలో ఇప్పటికే తనదైన ముద్ర వేసిని రియల్‌మీ మరింతగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉంది. గాడ్జెట్స్‌ నుంచి హోమ్‌ అప్లయెన్స్‌ రంగంలో కాలు మోపేందుకు రంగం సిద్ధం చేసింది.

టెక్‌లైఫ్‌ బ్రాండ్‌
హోం అప్లయెన్స్‌ విభాగంలో ఎల్‌జీ, శామ్‌సంగ్‌ కంపెనీలదే హవా నడుస్తోంది. వీటికి పోటీ ఇచ్చేందుకు రియల్‌మీ సిద్ధమైంది. అందులో భాగంగా రియల్‌మీ టెక్‌లైఫ్‌ అనే బ్రాండ్‌తో వరుసగా ఉత్పత్తులు రిలీజ్‌ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొదటగా రియల్‌ మీ నుంచి వాషింగ్‌ మెషిన్‌ మార్కెట్‌లోకి రానుంది. 

దీపావళి
స్మార్ట్‌ఫోన్‌ రంగంలో నాణ్యత, ఎక్కువ ఫీచర్లు, తక్కువ ధర అనే మూడు సూత్రాలతో రియల్‌ మీ విజయ బావుటా ఎగురవేసింది. తక్కువ కాలంలోనే ఇండియాలో అత్యధికంగా స్మార్ట్‌ఫోన్లు అమ్మిన కంపెనీగా రికార్డు సృష్టించింది. మరోసారి సక్సెస్‌ టెక్నిక్‌ని హోం అప్లయెన్స్‌ విభాగంలో కూడా రియల్‌మీ అమలు చేస్తుందని, ధరల యుద్ధం తప్పదని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టాప్‌లోడింగ్‌ వాషింగ్‌ మెషిన్‌ ధరకే ఫ్రంట్‌లోడ్‌ వాషింగ్‌ మెషిన్‌ రియల్‌ తెచ్చే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల మాటగా వినిపిస్తోంది.  దీపావళి పండక్కి రియల్‌ మీ నుంచి వాషింగ్‌ మెషిన్‌ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

రియల్‌మీ విస్తరణ
స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో విజయం సాధించిన వెంటనే ల్యాప్‌ట్యాప్‌ల అమ్మకంలోకి రియల్‌మీ ప్రవేశించింది. తక్కువ ధరకే నోట్‌బుక్‌ పేరిట ల్యాప్‌ల్యాప్‌లను మార్కెట్‌లోకి తెచ్చింది. ఇప్పటికే రియల్‌మీ నుంచి ట్రిమ్మర్లు, షేవర్లు మార్కెట్‌లో ఉన్నాయి.   

చదవండి: భారత్‌లోకి రియల్‌మీ బుక్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top