
ఫిబ్రవరి 2025లో కొన్ని బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit) వడ్డీ రేట్లను సవరించాయి. పెట్టుబడిదారులకు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఆకర్షణీయమైన రాబడిని అందించాలని నిర్ణయించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల రెపో రేటును తగ్గించినప్పటికీ, కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచలేదు. కొన్ని ఆర్థిక సంస్థలు సీనియర్ సిటిజన్లకు ఏటా 9.10% వరకు వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ఇటీవల ఎఫ్‌డీ వడ్డీరేట్లను అప్‌డేట్ చేసిన బ్యాంకుల వివరాలు కింద తెలుసుకుందాం.
సిటీ యూనియన్ బ్యాంక్
జనరల్ పబ్లిక్: 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 5% నుంచి 7.50% వరకు వడ్డీ.
సీనియర్ సిటిజన్లు: అదే కాలపరిమితికి సంవత్సరానికి 5% నుంచి 8% వరకు.
అత్యధిక వడ్డీ రేటు: సాధారణ ప్రజలకు 333 రోజుల కాలపరిమితికి సంవత్సరానికి 7.50%, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 8%.
అమలు తేదీ: ఫిబ్రవరి 10, 2025.
డీసీబీ బ్యాంక్
జనరల్ పబ్లిక్: 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 3.75% నుంచి 8.05% వరకు వడ్డీ లభిస్తుంది.
సీనియర్ సిటిజన్లు: అదే కాలపరిమితికి సంవత్సరానికి 4.25% నుంచి 8.55% వరకు వడ్డీ.
అత్యధిక వడ్డీ రేటు: 19 నుంచి 20 నెలల కాలపరిమితికి వార్షికంగా 8.05%, సీనియర్ సిటిజన్లకు 8.55%.
అమలు తేదీ: ఫిబ్రవరి 14, 2025.
కర్ణాటక బ్యాంక్
జనరల్ పబ్లిక్: 7 రోజులు-10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 3.50% నుంచి 7.50% వరకు వడ్డీ లభిస్తుంది.
సీనియర్ సిటిజన్లు: ఇదే కాలపరిమితికి సంవత్సరానికి 3.75% నుంచి 8% వరకు వడ్డీ.
గరిష్ట వడ్డీ రేటు: సాధారణ ప్రజలకు 401 రోజుల కాలపరిమితికి సంవత్సరానికి 7.50%, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 8%.
అమలు తేదీ: ఫిబ్రవరి 18, 2025.
శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
జనరల్ పబ్లిక్: 7 రోజులు-10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 3.50% నుంచి 8.55% వరకు.
సీనియర్ సిటిజన్లు: ఇదే కాలపరిమితికి సంవత్సరానికి 4% నుండి 9.05% వరకు వడ్డీ లభిస్తుంది.
అత్యధిక వడ్డీ రేటు: సాధారణ ప్రజలకు 1 రోజు నుంచి 18 నెలల కంటే తక్కువ కాలపరిమితికి, 12 నెలల కాలపరిమితికి ఏటా 8.55%, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 9.05% వడ్డీ.
అమలు తేదీ: ఫిబ్రవరి 18, 2025.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
జనరల్ పబ్లిక్: 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 3.75% నుంచి 8.25% వరకు వడ్డీ లభిస్తుంది.
సీనియర్ సిటిజన్లు: ఇదే కాలపరిమితికి సంవత్సరానికి 4.25% నుంచి 8.75% వరకు వడ్డీ లభిస్తుంది.
అత్యధిక వడ్డీ రేటు: 12 నెలల నుంచి 24 నెలల కాలపరిమితికి సాధారణ పౌరులకు సంవత్సరానికి 8.25%, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 8.75% వడ్డీ.
అమలు తేదీ: ఫిబ్రవరి 20, 2025.
ఇదీ చదవండి: ఈవీ బ్యాటరీ తయారీలోకి కైనెటిక్
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
జనరల్ పబ్లిక్: 7 రోజులు-10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 4% నుంచి 8.50% వరకు.
సీనియర్ సిటిజన్లు: అదే కాలపరిమితికి సంవత్సరానికి 4.50% నుండి 9.10% వరకు వడ్డీ లభిస్తుంది.
అత్యధిక వడ్డీ రేటు: 12 నెలల నుంచి 24 నెలల కాలపరిమితికి సాధారణ పౌరులకు సంవత్సరానికి 8.50%, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 9.10% వడ్డీ.
అమలు తేదీ: ఫిబ్రవరి 22, 2025.