‘ఫ్యూచర్‌’ కేసులో ఆర్బిట్రేషన్‌ తీర్పు అమలు చేయండి

Singapore EA  Award Valid Needs Executed Amazon Tells SC - Sakshi

సుప్రీం కోర్టుకు అమెజాన్‌ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: రిలయన్స్‌ రిటైల్‌తో విలీన ఒప్పందం విషయంలో ముందుకెళ్లరాదంటూ ఫ్యూచర్‌ రిటైల్‌కు సింగపూర్‌లోని ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్‌ (ఈఏ) ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ చెల్లుబాటు అవుతాయని, అవి అమలయ్యేలా చూడాలని సుప్రీం కోర్టును ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కోరింది. ఇవే ఆదేశాలకు అనుగుణంగా ఢిల్లీ హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ కూడా తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలియజేసింది. అయితే, ఈ విషయంలో ఫ్యూచర్‌ గ్రూప్‌కు అనుకూలంగా హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలు ఇవ్వడం సరికాదని పేర్కొంది.

రిలయన్స్‌–ఫ్యూచర్‌ డీల్‌ అంశంపై అత్యున్నత న్యాయస్థానంలో మంగళవారం ఈ మేరకు తమ వాదనలు వినిపించింది. సుప్రీం కోర్టు దీనిపై గురువారం లేదా వచ్చే మంగళవారం తదుపరి విచారణ చేపట్టనుంది. రిలయన్స్‌ రిటైల్‌లో ఫ్యూచర్‌ రిటైల్‌ను విలీనం చేసే దిశగా ఫ్యూచర్‌ గ్రూప్‌ దాదాపు రూ. 24,713 కోట్ల డీల్‌ను కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఫ్యూచర్‌ గ్రూప్‌లో వాటాదారైన అమెజాన్‌.. ఈ ఒప్పందం చట్టవిరుద్ధమంటూ న్యాయస్థానాలను, ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top