మహా కుంభ మేళా ప్రకటనల హక్కులు శ్రేయాస్‌కు | Shreyas Media secures exclusive advertising rights for Maha Kumbh Mela 2025 | Sakshi
Sakshi News home page

మహా కుంభ మేళా ప్రకటనల హక్కులు శ్రేయాస్‌కు

Dec 24 2024 12:16 AM | Updated on Dec 24 2024 8:07 AM

Shreyas Media secures exclusive advertising rights for Maha Kumbh Mela 2025

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సేల్స్, మార్కెటింగ్‌ కంపెనీ శ్రేయాస్‌ మీడియా మహా కుంభ మేళా–2025 ప్రత్యేక ప్రకటనల హక్కులను దక్కించుకుంది. కుంభ మేళా జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగనుంది. ఆధ్యశ్రీ ఇన్ఫోటైన్‌మెంట్‌లో భాగమైన శ్రేయాస్‌ మీడియా వెండింగ్, అమ్యూజ్‌మెంట్‌ జోన్స్, ఫుడ్‌ కోర్ట్‌ సహా పలు కార్యకలాపాల హక్కులు సైతం పొందింది. 

రూ.6,300 కోట్లతో యూపీ ప్రభుత్వం నిర్వహించనున్న ఈ మేళాకు దేశ, విదేశాల నుంచి 50 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో జరిగే ఈ మెగా ఈవెంట్‌ భారత చరిత్రలో అత్యంత గొప్ప కుంభ మేళా అవుతుందని శ్రేయాస్‌ మీడియా ఫౌండర్‌ జి.శ్రీనివాస్‌ రావు తెలిపారు. ప్రకటనలు, బ్రాండింగ్‌కు కంపెనీలు సుమారు రూ.3,000 కోట్లు వెచి్చంచే అవకాశం ఉందన్నారు. మేళా వేదికగా బ్రాండ్లను కోట్లాది మందికి చేర్చడానికి సంస్థ తనకున్న అపార అనుభవం, అసమాన నైపుణ్యాన్ని ఉపయోగిస్తుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement