దేశవ్యాప్తంగా కార్నివాల్స్‌పై కసరత్తు | Shreyas Media Launching Pan India Carnivals Inspired By Vijayawada Utsav, More Details Inside | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా కార్నివాల్స్‌పై కసరత్తు

Oct 11 2025 8:38 AM | Updated on Oct 11 2025 10:50 AM

Shreyas Media launching pan India carnivals inspired by Vijayawada Utsav

గిన్నిస్‌ రికార్డులకెక్కిన తమ విజయవాడ ఉత్సవ్‌ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా కార్నివాల్స్‌ను నిర్వహించనున్నట్లు శ్రేయాస్‌ మీడియా వెల్లడించింది. దేశ, విదేశీ కళాకారులతో ఏపీలోని అరకు, గండికోట వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సంస్థ ఫౌండర్‌ గండ్ర శ్రీనివాసరావు తెలిపారు.

30 పైచిలుకు భారీ కాన్సర్ట్స్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహా కుంభమేళా ప్రకటనల హక్కులను దక్కించుకుని, వేలాది బ్రాండ్స్‌ని కోట్ల మందికి చేరువ చేసినట్లు శ్రీనివాస్‌ చెప్పారు. తాజాగా సెపె్టంబర్‌లో 11 రోజుల పాటు సాగిన విజయవాడ ఉత్సవ్‌లో 15 లక్షల మంది పైగా పాల్గొనగా, స్థానికంగా రూ. 1,000 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనాలున్నట్లు తెలిపారు. 

ఎక్స్‌పోలో 600 స్టాల్స్‌ ఏర్పాటు చేయగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభించిందన్నారు. వచ్చే అయిదేళ్లలో విజయవాడ ఉత్సవ్‌తో రూ.5,000 కోట్ల వ్యాపార లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా తలపెట్టిన కార్నివాల్స్‌కు పలు బ్రాండ్స్‌ ముందుకొస్తున్నాయని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement