breaking news
carnivals
-
దేశవ్యాప్తంగా కార్నివాల్స్‌పై కసరత్తు
గిన్నిస్ రికార్డులకెక్కిన తమ విజయవాడ ఉత్సవ్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా కార్నివాల్స్‌ను నిర్వహించనున్నట్లు శ్రేయాస్ మీడియా వెల్లడించింది. దేశ, విదేశీ కళాకారులతో ఏపీలోని అరకు, గండికోట వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సంస్థ ఫౌండర్ గండ్ర శ్రీనివాసరావు తెలిపారు.30 పైచిలుకు భారీ కాన్సర్ట్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహా కుంభమేళా ప్రకటనల హక్కులను దక్కించుకుని, వేలాది బ్రాండ్స్‌ని కోట్ల మందికి చేరువ చేసినట్లు శ్రీనివాస్ చెప్పారు. తాజాగా సెపె్టంబర్లో 11 రోజుల పాటు సాగిన విజయవాడ ఉత్సవ్‌లో 15 లక్షల మంది పైగా పాల్గొనగా, స్థానికంగా రూ. 1,000 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనాలున్నట్లు తెలిపారు. ఎక్స్‌పోలో 600 స్టాల్స్ ఏర్పాటు చేయగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభించిందన్నారు. వచ్చే అయిదేళ్లలో విజయవాడ ఉత్సవ్‌తో రూ.5,000 కోట్ల వ్యాపార లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా తలపెట్టిన కార్నివాల్స్‌కు పలు బ్రాండ్స్ ముందుకొస్తున్నాయని తెలిపారు. -
కంటితో కాదు... మనోనేత్రంతో చూసి..!
గురి తప్పరు గురి చూసి.. కొమ్ము విసిరితే బోర్డ్‌పై గమ్యాన్ని చేరాలి. అదే ‘డార్ట్‌గేమ్’. చూపు ఉన్నా గురి కుదరడం అంత సులభం కాదు. ఆ గేమ్‌కు విదేశాల్లో మంచి ఆదరణ. కార్నివాల్స్‌లో డార్ట్గేమ్దే ప్రధాన ఆకర్షణ. మరి ఇలాంటి ఆటను అంధులు ఆడితే? యూరప్‌లో అనేక దేశాల్లో కార్నివాల్స్‌లో డార్ట్‌గేమ్ అడుతారు. విషయం ఏమిటంటే... చూపున్న వారికంటే అంధులు ఈ ఆటను బాగా ఆడుతున్నారు. ఇందుకు డార్ట్‌గేమ్ నిర్వాహకుల ప్రోత్సాహం కూడా బాగానే ఉంటోంది. అంధులు ఉత్సాహంగా ఈ గేమ్ ఆడుతున్నారని... వారు డార్ట్ ఆడుతున్నప్పుడు గురి తప్పి గోడలకు, ఇతర వస్తువులకు తగిలి నష్టం జరిగేదేమీ లేదని.. వారి గురి కుదురుతోందని.. ప్రాక్టీస్‌తో పర్ఫెక్షన్ సాధిస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.