stockmarket:  53వేల దిగువకు సెన్సెక్స్‌  | Sakshi
Sakshi News home page

stockmarket:  53వేల దిగువకు సెన్సెక్స్‌ 

Published Mon, Jun 28 2021 4:35 PM

Sensex, Nifty Decline Led By Losses In Infosys TCS Reliance  - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలో రికార్డు స్తాయిలను తాకిన సూచీలు ఆ తరువాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్‌ సెషన్‌ నుంచి మరింత అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌  ప్రకటించిన వైద్య, పర్యాటకరంగ ఉపశమన చర్యలు  ఆయా రంగాలకు కొంత  ఊరటనిచ్చాయి.  చివరికి సెన్సెక్స్‌ 189 పాయింట్ల నష్టంతో 52735 వద్ద,నిఫ్టీ 46 పాయింట్లు క్షీణించి 15814 వద్ద స్థిరపడ్డాయి.

ప్రధానంగా ఇండెక్స్ హెవీవెయిట్స్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్‌  నష్టాలతో ఇంట్రాడే లాభాలు హరించుకు పోయాయి. దివీస్‌ ల్యాబ్స్, ఒఎన్‌జిసి, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్స్, టాటా స్టీల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, సిప్లా, జెఎస్‌డబ్ల్యు స్టీల్, గ్రాసిం,  హిందాల్కో, ఎన్‌టీపీసీ, సన్ ఫార్మా లాభాల్లో ముగిసాయి. అయితే దేశీయంగా  డెల్టా  ప్లస్‌ వేరియంట్‌ఆందోళనకు తోడు, ఆసియాలో కరోనా ఉధృతి ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారి తీసిందని విశ్లేషకులు పేర్కొన్నారు. 

Advertisement
Advertisement