
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలోనే నష్టాల బాట పట్టిన సూచీలు రోజంతా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఐటీ, డ్యూరబుల్స్, బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా కుప్పకూలాయి. చివరికి సెన్సెక్స్ 568 పాయింట్లు కుప్పకూలి 55107 వద్ద, నిఫ్టీ 153 పాయింట్లు నష్టంతో 16416 వద్ద స్థిరపడింది.
అన్ని సెక్టార్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. టైటన్, యూపీఎల్, డా. రెడ్డీస్, బ్రిటానియా, టీసీఎస్, ఎల్ అండ్ టీ భారీగా నష్టపోగా ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, మారుతి సుజుకి, ఎన్‌టీపీసీ, రిలయన్స్ లాభపడ్డాయి.
అటు ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 5 పైసలు(77.71) పడిపోయింది దీనికి తోడు ముడిచమురు ధరలు పెరగడం, విదేశీ మూలధన ప్రవాహాలు నిలకడగా ఉండడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని ఫారెక్స్ డీలర్లు తెలిపారు.