వెంటనే ఫోటో డిలీట్ చేయండి: ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్‌బీఐ | SBI Tells Man to Delete Pic of Branch Immediately | Sakshi
Sakshi News home page

వెంటనే ఫోటో డిలీట్ చేయండి: ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్‌బీఐ

Jun 1 2024 8:15 PM | Updated on Jun 1 2024 8:57 PM

SBI Tells Man to Delete Pic of Branch Immediately

ఇటీవల ఓ వ్యక్తి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాళీగా ఉన్న బ్రాంచ్ ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలను వెంటనే డిలీట్ చేయాలని ఆ వ్యక్తిని ఎస్‌బీఐ హెచ్చరించింది.

ఒక వ్యక్తి మధ్యాహ్నం 3 గంటల సమయంలో బ్యాంకుకు వెళ్ళాడు. ఆ సమయంలో బ్యాంకులో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో.. అసహనానికి గురయ్యాడు. దీంతో ఖాళీగా ఉన్న క్యాబిన్ ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపించారు. బ్యాంకులో ఒకేసారి మధ్యాహ్న భోజనానికి వెళితే.. కస్టమర్లు ఇబ్బంది పడతారని, ఆలా చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. కస్టమర్‌కు కలిగిన అసౌకర్యానికి ఎస్‌బీఐ చింతించింది.

ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలను వెంటనే తొలగించాలని హెచ్చరించింది. బ్యాంకులో ఫోటోలు, వీడియోలు పూర్తిగా నిషిద్ధం. ఇవన్నీ భద్రతకు భంగం కలుగుతాయని పేర్కొంటూ.. జరగరానిది ఏమైనా జరిగితే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎస్‌బీఐ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement