ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..

Published Thu, May 16 2024 7:36 AM

SBI hikes fixed deposit interest rates

ముంబై: ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. టైల్‌ స్థిర డిపాజిట్లకు (రూ.2 కోట్ల వరకూ ఎఫ్‌డీలు) సంబంధించి కొన్ని కాల పరిమితులపై వడ్డీరేట్లను పెంచింది. 2023 డిసెంబర్‌ తర్వాత బ్యాంక్‌ ఎఫ్‌డీలపై వడ్డీరేటు పెంచడం ఇదే తొలిసారి.  

బ్యాంక్‌ వెబ్‌సైట్‌ ప్రకారం, ఈ రేట్లు మే 15 నుంచి అమల్లోకి వస్తాయి. 46 రోజుల నుంచి 179 రోజులు, 180 నుంచి 210 రోజులు, 211 రోజుల నుంచి ఏడాది లోపు కాలపరిమితుల డిపాజిట్‌ రేట్లు 25 నుంచి 75 బేసిస్‌ పాయింట్ల శ్రేణిలో (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెరిగాయి. కాగా, సీనియర్‌ సిటిజన్‌లకు ఆయా కాలపరిమితులపై (టేబుల్‌లో పేర్కొన్న రేట్ల కన్నా అదనంగా) పేర్కొన్న డిపాజిట్‌ రేట్లకు అదనంగా  మరో 50 బేసిస్‌ పాయింట్ల వడ్డీరేటు లభిస్తుంది. దీర్ఘకాలిక (ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్య) డిపాజిట్‌పై ఏకంగా  1% వరకూ అదనపు వడ్డీరేటు లభిస్తుంది. 

తాజా రేట్లు ఇలా... 
కాల పరిమితి     వడ్డీ(%) 
7–45 రోజులు     3.5
46–179 రోజులు    5.5 
180–210 రోజులు    6.0 
211 రోజులు– ఏడాది    6.25 
ఏడాది–రెండేళ్లు    6.80 
రెండేళ్లు–మూడేళ్లు    7.00 
మూడేళ్లు– ఐదేళ్లు     6.75
ఐదేళ్లు– పదేళ్లు     6.50   

 

Advertisement
 
Advertisement
 
Advertisement