
ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు సంబంధించి ముఖ్యమైన వార్త ఇది. ఈ కార్డుదారులకు ఇప్పటివరకూ ఉచితంగా అందిస్తున్న ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని ఆగస్టు 11 నుండి కార్డు జారీ సంస్థ నిలిపివేయబోతోంది. ఈ మార్పు విమాన ప్రయాణంలో భద్రత కోసం ఈ సదుపాయంపై ఆధారపడిన వారిని నేరుగా ప్రభావితం చేస్తుంది.
ఇప్పటివరకు ఎస్‌బీఐ ప్రీమియం, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై రూ.కోటి లేదా రూ.50 లక్షల వరకు కాంప్లిమెంటరీ (ఉచిత) విమాన ప్రమాద బీమా అందుబాటులో ఉండేది. ఆగస్టు 11 తర్వాత ఈ బెనిఫిట్ అందుబాటులో ఉండదు. ఈ సదుపాయం ముగిసే కార్డులలో ఈ కిందివి ఉన్నాయి..
రూ.1 కోటి ఇన్సూరెన్స్ కవర్ ఉన్న కార్డులు
ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్
ఎస్‌బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్
ఎస్‌బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్
యూకో బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ఎలైట్
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కార్డ్ ఎలైట్
అలహాబాద్ బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ఎలైట్
పీఎస్బీ ఎస్బీఐ కార్డ్ ఎలైట్
కరూర్ వైశ్యా బ్యాంక్ (కెవిబి) ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్
కేవీబీ ఎస్బీఐ సిగ్నేచర్ కార్డు
రూ.50 లక్షల ఇన్సూరెన్స్ కవరేజీ ఉన్న కార్డులు
ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్
ఎస్‌బీఐ కార్డ్ పల్స్
యూకో బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కార్డ్ ప్రైమ్
పీఎస్బీ ఎస్బీఐ కార్డ్ పీఎంకేవీబీ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్
కేవీబీ ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డు
సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్
సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డు
కర్ణాటక బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్
కర్ణాటక బ్యాంక్ ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డు
సిటీ యూనియన్ బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్
యూబీఐ ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డు
ఓబీసీ ఎస్బీఐ వీసా ప్లాటినం కార్డు
ఫెడరల్ బ్యాంక్ ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డు
మీరు ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు యూజర్లు అయితే ఇప్పుడు విమాన ప్రయాణ సమయంలో మీకు ఈ అదనపు రక్షణ లభించదు. అటువంటి పరిస్థితిలో, మీరు తరచుగా ప్రయాణిస్తూ ఉచిత బీమాపై ఆధారపడి ఉంటే, ఇప్పుడు ప్రత్యేక ప్రయాణ లేదా వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకోవలసి ఉంటుంది. ఈ బెనిఫిట్ మీకు ముఖ్యమైతే కచ్చితంగా మార్కెట్లో అందుబాటులో ఉన్న వ్యక్తిగత ట్రావెల్ లేదా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
చదవండి: ఏటీఎంలో రూ.500 నోట్లు కనుమరుగు! ఆర్బీఐ ఆర్డరు నిజమేనా?