ఏటీఎంలో రూ.500 నోట్లు కనుమరుగు? | RBI To Stop Rs 500 Notes In ATMs Here is What Govt Said | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో రూ.500 నోట్లు కనుమరుగు! ఆర్బీఐ ఆర్డరు నిజమేనా?

Aug 4 2025 6:37 PM | Updated on Aug 4 2025 8:10 PM

RBI To Stop Rs 500 Notes In ATMs Here is What Govt Said

ఏటీఎంలలో రూ.500 నోట్లు కనుమరుగు కానున్నట్లు ఓ సందేశం వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది.  సెప్టెంబర్ 30లోగా ఏటీఎంల ద్వారా రూ.500 నోట్ల జారీని నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులను ఆదేశించిదనేది ఆ సందేశం సారాంశం. అయితే ఆ వాట్సాప్ సందేశం అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రానున్న సెప్టెంబర్ 30 నాటికి 75 శాతం ఏటీఎంలలో, 2026 మార్చి 31 నాటికి 90 శాతం ఏటీఎంలలో రూ.500 నోట్ల జారీని నిలిపివేయాలనేది ఆర్బీఐ లక్ష్యం అంటూ కూడా ఫేక్‌ మెసేజ్‌లో పేర్కొన్నారు.  రానున్న రోజుల్లో ఏటీఎంల ద్వారా రూ.100, రూ.200 నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని, కాబట్టి ఎవరి దగ్గరైనా రూ.500 నోట్లు ఉంటే వెంటనే మార్చేసుకోవాలని కూడా అందులో సూచించారు.

వాట్సాప్‌లో విస్తృతంగా షేర్ అయిన ఈ తప్పుడు సందేశంపై స్పందించిన ప్రభుత్వ మీడియా విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఆర్బీఐ అలాంటి ఆదేశాలేవీ జారీ చేయలేదని, రూ.500 నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైనవేనని తెలిపింది. ఈ మేరకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని, వాటిని షేర్‌ చేసే ముందు అధికారిక వర్గాల ద్వారా ధ్రువీకరించుకోవాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement