
కృత్రిమ మేధ, వర్క్ ఫ్లో ఆటోమేషన్ సామర్థ్యాల్లో వ్యూహాత్మక విస్తరణలో భాగంగా మెర్జెన్ కార్పొరేట్స్ తన అతిపెద్ద ‘సర్వీస్ నౌ డిజిటల్ వర్క్ ఫ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)’ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ సెంటర్ కోసం మొత్తంగా 1 మిలియన్ డాలర్లను(సుమారు రూ.8.3 కోట్లు) వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: ‘ఏదో అలా బ్రతికేస్తున్నాం.. అంతే..’
ప్రస్తుతానికి కంపెనీలో 50+ సర్వీస్ నౌ నిపుణులు పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2026 ప్రారంభం నాటికి ఈ సంఖ్య రెట్టింపు కానున్నట్లు కంపెనీ పేర్కొంది. కొత్తగా ప్రారంభించిన సెంటర్ 150 సీట్ల కెపాసిటీని కలిగి ఉన్నట్లు చెప్పింది. భవిష్యత్తులో దీని విస్తరణకు అనువుగా 8,000 చదరపు అడుగులు స్థలం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఏఐ, లో-కోడ్ ప్లాట్ ఫామ్‌లు, ఏఐఓపీలు, పరిశ్రమ-నిర్ధిష్ట డిజిటల్ వర్క్‌ఫ్లోలను ఇందులో అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. మెర్జెన్ ఫౌండర్ అండ్ సీఈఓ మహంత్ మల్లికార్జున మాట్లాడుతూ..‘అభివృద్ధి చెందుతున్న క్లయింట్ అవసరాలను తీర్చడానికి పరిశ్రమ నిర్దిష్ట పరిష్కారాలను అందిస్తున్నాం’ అన్నారు.