5జీ స్మార్ట్‌ ఫోన్‌ పై బంపరాఫర్‌, మరికొన్ని గంటలు మాత్రమే

Samsung Galaxy F42 5g Exchange Offer On Big Saving Days Sale - Sakshi

5జీ స్మార్ట్‌ ఫోన్‌లపై ఫ్లిప్‌ కార్ట్‌ బంపరాఫర్‌ ప్రకటించింది. ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్‌ డిసెంబర్‌ 16 నుంచి డిసెంబర్‌ 21వరకు 'బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్' పేరుతో ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా 5జీ స్మార్ట్‌ ఫోన్‌  శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 42ను డిస్కౌంట్‌, భారీ ఎక్ఛేంజ్‌ను అందిస్తుంది. 

ఫ్లిప్‌ కార్ట్‌లో ఫోన్‌ ధర రూ.20,999 ఉండగా డెబిట్, క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడం ద్వారా రూ. 3 వేల వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు.

తద్వారా రూ. 17,999కే స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.అంతేకాదు రూ.20,999 ఫోన్‌ను  మీ పాత ఫోన్‌ పై రూ.15,450 భారీ ఎక్సేంజ్ ఆఫర్ తో సొంతం చేసుకోవచ్చు.అంటే ఫోన్‌ ను రూ.5,549కే కొనుగోలు చేయొచ్చు

.  

శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 42 ఫోన్‌ ఫీచర్లు 

ఈఫోన్‌ లో 5000ఏఎంహెచ్‌ బ్యాటరీ

6జీబీ ర్యామ్‌,128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌

మీడియా టెక్‌ డైమన్షన్‌ 700 ప్రాసెసర్ 

64 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ ట్రిపుల్ రేర్‌  కెమెరా, ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

మాట్ బ్లాక్ వేరియంట్ కలర్‌లో అందుబాటులో ఉంది. 

చదవండి: రూ.30-40 వేల బడ్జెట్‌లో ఎక్కువగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ ఇదే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top