రూ.30-40 వేల బడ్జెట్‌లో ఎక్కువగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ ఇదే!

iQOO 7, iQOO 7 Legend are Top-Selling 5G Smartphones in RS 30-40K Segment - Sakshi

ఐక్యూ7 సిరీస్(ఐక్యూ7,ఐక్యూ7 లెజెండ్) స్మార్ట్‌ఫోన్లు ఆగస్టు నెలలో భారతదేశంలో రూ.30,000 నుంచి రూ.40,000 సెగ్మెంట్ లో ఎక్కువగా అమ్ముడైన 5జీ స్మార్ట్‌ఫోన్లుగా నిలిచాయి. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ దేశంలోని మొబైల్ గేమింగ్ కమ్యూనిటీలో విజయవంతమైంది. ఆగస్టు నెలకు భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ షిప్ మెంట్ వివరాలను వెల్లడిస్తూ ఇటీవల కౌంటర్ పాయింట్ నివేదికలో ఈ గణాంకాలు పంచుకుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లను ఏప్రిల్ లో లాంచ్ చేశారు.

ఈ ఐక్యూయూ మొబైల్స్ విమర్శకులు, వినియోగదారుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ పొందాయి. ఐక్యూ 7 లెజెండ్ రూ.40,000 ధరలో అత్యుత్తమ మొబైల్స్ లో ఇది ఒకటిగా నిలిచింది. దీనిలో క్వాల్‌కామ్‌ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, ట్రిపుల్ లెన్స్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఐక్యూ 7 విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ అమోల్డ్ స్క్రీన్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్, 66డబ్ల్యు ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ లెన్స్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఐక్యూ 7 లెజెండ్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.39,990 ధరకు, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.43,990 ధరకు మార్కెట్లోకి వచ్చాయి. ఇక ఐక్యూ 7 రెండు వేరియెంట్లు 8జీబీ ర్యామ్, విభిన్న స్టోరేజీలతో వచ్చింది. ఇందులో ప్రస్తుతం రిటైల్ ధర రూ.29,990గా ఉంది.
(చదవండి: అదృష్టమంటే ఇదేనెమో..! 4 రోజుల్లో రూ.6 లక్షల కోట్లు సొంతం...!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top