అంత లేదు...నేనూ సంపాదిస్తున్నా: మండిపడిన సమంత | Samantha Ruth Prabhu reacts to rumours of taking rs 25 crore for myositis treatment | Sakshi
Sakshi News home page

అంత లేదు...నేనూ సంపాదిస్తున్నా: మండిపడిన సమంత

Aug 5 2023 12:46 PM | Updated on Aug 5 2023 1:00 PM

Samantha Ruth Prabhu reacts to rumours of taking rs 25 crore for myositis treatment - Sakshi

స్టార్ హీరోయిన్ సమంత మైయోసైటిస్‌ చికిత్స కోసం టాలీవుడ్‌ స్టార్ హీరో ఆర్థిక సాయంచేశారన్న వార్తలపై  సమంత స్పందించింది.  ఇవన్నీ గాలి వార్తలని కొట్టి పారేసింది. తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఆమె  మండిపడ్డారు. ఈమేరకు ఆమె ఇన్‌స్టా స్టోరీని పోస్ట్‌ చేసింది. సుదీర్ఘ కాలంగా సినిమాల్లో పనిచేసిన తనకు  ఆ మాత్రం సామర్థ్యం ఉందని, తనను తాను చూసుకోగలనని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తెలిపింది.

మైయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్న సమంత త్వరితగతిన తనచేతిలో ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్‌ చేసింది. అలాగే ఆరోగ్యం సహకరించని కారణంగా చాలా ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడమేకాదు, కొంత కాలం పాటు సినిమాలకు విరామాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఆమె ప్రకృతి ఒడిలో బాలి వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తోంది.

కాగా మైయోసైటిస్‌ చికిత్స కోసం టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో ఆర్థిక సాయాన్ని చేశారనే తప్పుడు కథనాలు వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేశాయి. సమంత కు ‘యశోద’ సినిమా సమయంలోనే ఆమెకు మైయోసైటిస్‌ ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. కొన్నాళ్ల చికిత్స తరువాత తన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement