మూలధన లాభం రూ. 2 కోట్ల లోపు ఉంటే.. | Sakshi
Sakshi News home page

మూలధన లాభం రూ. 2 కోట్ల లోపు ఉంటే..

Published Mon, Mar 18 2024 8:48 AM

Sale of Immovable Property - Sakshi

మీరు స్థిరాస్తి అమ్మే విషయంలో లాభం .. అంటే దీర్ఘకాలిక మూలధన లాభాలు 
రూ. 2 కోట్ల లోపల ఉంటే ఏం చేయాలి .. 
ఎలా చేయాలి అనేది ఈ వారం తెలుసుకుందాం. 
1. ఇల్లు అమ్మినప్పుడు ఈ లాభం ఏర్పడాలి. 
2. మినహాయింపు జీవితంలో ఒకసారే ఇస్తారు. 
3. ఇల్లు ఇండియాలోనే కొనాలి. 
4. ఒక ఇంటికి బదులుగా రెండు ఇళ్లు కొనుక్కోవచ్చు. 
5. ఇల్లు కొనడం .. కట్టించడం, ఒక ఇల్లు కొని మరో ఇల్లు కట్టించడం.. రెండూ కొనడం లేదా రెండూ కట్టించుకోవడం చేయొచ్చు. 
6. 2019 ఏప్రిల్‌ 1 తర్వాతనే 
ఈ నియమం వర్తిస్తుంది. 
మిగతా షరతులు గతంలో చెప్పినట్లే వర్తిస్తాయి. 
కొన్ని ఉదాహరణలు గమనించండి.. 
1. ముత్యాలరావుగారికి ముచ్చటగా రూ. 3 కోట్లు లాభం వచి్చంది. విశాఖపట్నంలో రెండు ఇళ్లు కొన్నారు. లాభం రూ. 2 కోట్లు దాటింది కాబట్టి ఒక ఇంటి మీదే మినహాయింపు. 
2. ఇదే ముత్యాలరావుగారికి లాభం ఒక కోటి 
తొంభై లక్షలు వచి్చందనుకోండి.. లాభం 
రూ. 2 కోట్లు దాటలేదు రెండింటి మీద మినహాయింపు ఇస్తారు. 
3. నారాయణరావుగారికి లాభాలు రూ. ఒక కోటి తొంభై ఐదు లక్షలు వచి్చంది. ముగ్గురు పిల్లలకని మూడు ఫ్లాట్లు.. ఒక్కొక్కటి రూ. 65,00,000 చొప్పున కొన్నారు. కానీ, రెండు ఫ్లాట్లకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది. 
4. సుందరరావుగారికి అంతే లాభం వచ్చింది. ఒకోటి రూ. 80 లక్షలు చొప్పున రెండు ఫ్లాట్లు కొని, మిగతా మొత్తంతో బాండ్లు కొన్నారు. వీరికి రెండు ఫ్లాట్లు కొన్నందుకు మినహాయింపు, అలాగే బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసినందుకు కూడా మినహాయింపు వస్తుంది. 
5. సత్యమూర్తిగారికి వచి్చన లాభం రూ. 2.60 కోట్లు. రెండు ఇళ్లు కొన్నారు. ఒకటి రూ. 1.50 కోట్లు, మరొకటి రూ. 90 లక్షలు. మిగతా రూ. 20 లక్షలు పెట్టి బాండ్లు కొన్నారు. మొదటి 
ఇంటికి, బాండ్లకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. 
6. సీతయ్యగారికి లాభం కోటి అరవై లక్షలు వచి్చంది. కానీ ఆయన కొన్న రెండు ఇళ్ల విలువ రెండు కోట్లు దాటింది. అతనికి మినహాయింపు ఉంటుంది. అదనంగా వెచి్చంచిన మొత్తానికి ‘సోర్స్‌’ ఉండాలి. 
7. కాంతారావుగారికి కూడా కోటి అరవై లక్షల లాభం వచి్చంది. కానీ, తాను కొన్న రెండు ఇళ్ళ విలువ కోటి యాభై లక్షలు దాటలేదు. రూ. 10 లక్షలు పన్నుకి గురి అవుతుంది. సత్యమూర్తిగారిలాగా బాండ్లు కొనుక్కోవచ్చు లేదా 
పన్ను చెల్లించాలి. 
ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అయితే, జాగ్రత్తలు ఏమిటంటే .. 
1. గత వారం చెప్పిన నియమాలు వర్తిస్తాయి. 
2. అన్ని కాగితాలు జాగ్రత్త. 
3. బ్లాక్‌ వ్యవహారాలు వద్దు. 
4. మీ బ్యాంకు అకౌంట్లలోనే 
వ్యవహారాలు చేయండి. 
5. మీ కుటుంబసభ్యులను ఇన్వాల్వ్‌ చేసి ఎటువంటి మినహాయింపు కోసం ప్రయత్నించకండి. ఉదాహరణకు రూ. 2 కోట్ల లాభం మీకు చూపించటానికి ప్రతిఫలం వేరే సభ్యుల 
అకౌంట్లలోనో జమ చేయించకండి. 
6. టీడీఎస్‌ విషయం ఫాలో అవ్వండి. 
7. రిటర్నులు సక్రమంగా వేయండి. 
8. రెండు ఇళ్లు మీరు కొంటే.. మీరు ఉంటారా 
లేక అద్దెకిస్తారా ఆలోచించుకోండి. 
9. అవసరం అయితే వృత్తి నిపుణులను 
సంప్రదించండి.   

పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు 
business@sakshi.comకు
ఈ–మెయిల్‌ పంపించగలరు.

Advertisement
Advertisement