రూపీ 50 పైసలు డౌన్‌.. కారణాలు ఇవే! | Sakshi
Sakshi News home page

రూపీ 50 పైసలు డౌన్‌.. కారణాలు ఇవే!

Published Tue, Nov 15 2022 7:35 AM

Rupee Falls By 50 Paise To Crosses 81 Against Dollar, Fed Rate Hike Concerns - Sakshi

ముంబై: రూపాయి విలువ సోమవారం 50 పైసలు క్షీణించి 81.28 స్థాయి వద్ద నిలిచింది. మెరుగైన  స్థూల ఆర్థిక గణాంకాల నమోదు అండతో ఉదయం ఫారెక్స్‌ మార్కెట్లో 80.53 స్థాయి వద్ద మొదలైంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనైన రూపాయి ఏ దశలోనూ కోలుకోలేక ఇంట్రాడే కనిష్ట స్థాయి వద్ద ముగిసింది.

‘‘దేశీయ కార్పొరేట్, ఆయిల్‌ కంపెనీల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఈక్విటీ మార్కెట్‌ స్తబ్ధుగా ట్రేడైంది. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలపడింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరిగింది. ఈ అంశాలు మన కరెన్సీపై ఒత్తిడిని పెంచాయి’’ అని ఫారెక్స్‌ ట్రేడర్లు తెలిపారు.

చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్‌: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా!

Advertisement
Advertisement