
విద్యార్థుల కోసం శ్రీ చైతన్య విద్యాసంస్థలు రూపొందించిన యాప్‌ను ఆవిష్కరించిన భారత క్రికెట్ జుట్టు కెప్టెన్ రోహిత్ శర్మ...
హైదరాబాద్: విద్యార్థులకు పూర్తి స్థాయి శిక్షణ అందించేందుకు శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ కొత్తగా ’ఇన్ఫినిటీ లెర్న్’ యాప్‌ను ప్రారంభించింది. 6–12 తరగతుల విద్యార్థులకు అత్యుత్తమ ఫ్యాకల్టీ, కంటెంట్‌తో పాటు వ్యక్తిగతీకరించిన ఇంటరాక్టివ్ క్లాసులను అందించడమే దీని లక్ష్యమని యాప్ ఆవిష్కరణ సందర్భంగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు.
ఐఐటీ–జేఈఈ, నీట్, సీబీఎస్‌ఈ బోర్డ్ మొదలైన పరీక్షలకు విద్యార్థులు సులభంగా సిద్ధం కావచ్చని శ్రీచైతన్య–ఇన్ఫినిటీ లెర్న్ ఫౌండర్, డైరెక్టర్ సుష్మ బొప్పన పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికతతో ఫిజికల్ క్లాస్‌రూమ్ స్థాయి శిక్షణను డిజిటల్ మాధ్యమంలో అందించాలన్నది తమ ఉద్దేశమని ఆమె వివరించారు.
తమ విశిష్టమైన ‘4అ లెర్నింగ్ మోడల్’.. విద్యాభ్యాసాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుందని, విద్యార్థులను విజేతలుగా నిలబెట్టగలదని ఇన్ఫినిటీ లెర్న్ సీఈవో ఉజ్వల్ సింగ్ తెలిపారు. ఇందులో 2–వే ఇంటరాక్టివ్ వీడియో తరగతు లు, క్విజ్‌లు, మాక్ టెస్ట్‌లు, చిట్కాలు, మొదలైన ఫీచర్లు అనేకం ఉన్నాయని వివరించారు.
చదవండి: జీఎస్‌టీ శ్లాబుల్లో మార్పులు..కేంద్రం వివరణ..!