రిలయన్స్‌ రిటైల్‌ చేతికి  కెల్వినేటర్‌ బ్రాండ్‌  | Reliance Retail Acquires Home Appliances Brand Kelvinator from for Rs160 cr | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ రిటైల్‌ చేతికి  కెల్వినేటర్‌ బ్రాండ్‌ 

Jul 19 2025 4:29 AM | Updated on Jul 19 2025 7:02 AM

Reliance Retail Acquires Home Appliances Brand Kelvinator from for Rs160 cr

ఎలక్ట్రోలక్స్‌ నుంచి కొనుగోలు

రూ.160 కోట్ల డీల్‌

న్యూఢిల్లీ: రిలయన్స్‌ రిటైల్‌ తాజాగా ఎలక్ట్రోలక్స్‌ గ్రూప్‌ కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ బ్రాండ్‌ కెల్వినేటర్‌ను కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ సుమారు రూ. 160 కోట్లు. దేశీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రీమియం గృహోపకరణాల విభాగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు రిలయన్స్‌ రిటైల్‌కి ఇది ఉపయోగపడనుంది. రిలయన్స్‌ రిటైల్‌ గతంలో కెల్వినేటర్‌ బ్రాండ్‌కి లైసెన్సు తీసుకుని, ఉపయోగించుకుంది. దీని కింద ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్‌ మెషిన్లు మొదలైనవి అమ్ముడవుతున్నాయి. 

భారతీయ వినియోగదారులకు విశ్వసనీయమైన అంతర్జాతీయ ఉత్పత్తులను అందించేందుకు కెల్వినేటర్‌ కొనుగోలు తోడ్పడుతుందని రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ ఈడీ ఈషా ఎం అంబానీ ప్రకటనలో తెలిపారు. కెల్వినేటర్‌కు అంతర్జాతీయంగా దాదాపు శతాబ్దంపైగా చరిత్ర ఉంది. అధునాతన టెక్నాలజీ, అత్యుత్తమ పనితీరుతో 1970లు, 1980లలో భారత్‌లో ఐకానిక్‌ స్థాయిని దక్కించుకుంది. 

అమెరికన్‌ బ్రాండ్‌ అయినప్పటికీ పలు సంస్థల చేతులు మారి చివరికి స్వీడన్‌కి చెందిన ఎలక్ట్రోలక్స్‌ గూటికి చేరింది.  ఇటీవలి సీఐఐ, ఈవై సంయుక్త నివేదిక ప్రకారం భారత కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ మార్కెట్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒక టి. 2027 నాటికి అతి పెద్ద మార్కెట్లలో నా లుగో స్థానానికి చేరనుంది. 2029 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 3 లక్షల కోట్ల స్థాయికి చేరుతుంది. మరోవైపు, క్రిసిల్‌ రేటింగ్స్‌ ప్ర కారం 2024–25లో ఈ పరిశ్ర మ (టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్‌ మెíషీన్లు) రూ. 1.17 లక్షల కోట్ల స్థాయిలో ఉంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement