breaking news
Kelvinator
-
ఆ పాత బ్రాండ్లకు ‘భలే’ మంచి రోజులు!
Reliance Retail Brings BPL And Kelvinator: తరాలు తరలిపోతున్న కొద్దీ.. ‘జ్ఞాపకాలు’ మేలనే అభిప్రాయం చాలామందికి కలగడం సహజం. టెక్నాలజీ ఎరాలో ఎన్నో అప్డేట్స్ వెర్షన్లు వస్తున్నా.. పాత వాటికి ఉన్నంత గ్యారెంటీ ఉండట్లేదనే రివ్యూలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటి బ్రాండ్లను తిరిగి జనాలకు అందించే ప్రయత్నాలు ఈమధ్యకాలంలో ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ రిటైల్.. బీపీఎల్, కెల్వినేటర్ ఉత్పత్తులను తిరిగి జనాల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఎయిటీస్, నైంటీస్ జనరేషన్‌కి బీపీఎల్ టీవీలు, కెల్వినేటర్ స్టెబ్లైజర్, ఫ్రిజ్‌ల లాంటి ప్రొడక్టులతో మంచి అనుభవమే ఉంది. ముఖ్యంగా డబ్బా టైప్ టీవీలు ‘బండ’ బ్రాండ్ అనే అభిప్రాయాన్ని ఏర్పరిచాయి కూడా. ఒకప్పుడు వర్చువల్ ఎంటర్టైన్మెంట్లో బీపీఎల్ టీవీలది అగ్రస్థానం ఉండేది. అయితే మిల్లీనియంలోకి అడుగుపెట్టాక టాప్ టెన్ బ్రాండ్ లిస్ట్ నుంచి కనుమరుగైన బీపీఎల్.. ఇతర కంపెనీల రాక, అటుపై బీపీఎల్‌లో ఆర్థిక క్రమశిక్షణ లోపించిన కారణంగా పతనం దిశగా నడిచింది. ఈ నేపథ్యంలో ‘నమ్మకం’ పేరుతో ప్రచారం చేసుకున్న బీపీఎల్‌ను, కెల్వినేటర్ బ్రాండ్లను రిలయన్స్ రిటైల్ తీసుకురానుంది. క్లిక్: హీరో ఈ-బైక్.. ఇక ఈజీగా! బీపీఎల్.. ది ‘బ్రిటిష్ ఫిజికల్ లాబోరేటరీస్’ 1963 పలక్కాడ్ (కేరళ)లో ప్రారంభించారు. హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంది. రిలయన్స్ రిటైల్ ఎలక్ట్రికల్ రంగంలోకి అడుగుపెట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. టీవీ, ఎయిర్ కండిషనర్స్, వాషింగ్ మెషిన్స్, టీవీలు, లైట్ బల్బ్స్, ఫ్యాన్స్ లాంటి ప్రొడక్టుల తయారీతో అమ్మకాలను స్వయంగా నిర్వహించనుంది. ఇప్పటికే కెల్వినేటర్తో ఒప్పందం కుదుర్చుకోగా.. బీపీఎల్‌కు సంబంధించిన ఒప్పందం గురించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ రెండింటిలతో పాటు మరో రెండు ఓల్డ్ బ్రాండులను సైతం తీసుకొచ్చేందుకు రిలయన్స్ సుముఖంగా ఉంది. ఆఫ్‌లైన్, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో అందించనున్నట్లు సమాచారం. అయితే ఇవి వింటేజ్ మోడల్స్లోనా? లేదంటే అప్డేటెడ్ మోడల్స్లోనా? అనే విషయంపై అధికారిక ప్రకటనల సమయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చదవండి: మెగాస్టార్ అద్భుత ప్రయోగం -
కెల్వినేటర్ ఫెస్టివ్ బొనంజా కన్సూమర్ ఆఫర్
హైదరాబాద్: ప్రముఖ హోమ్ అప్లయెన్సెస్ బ్రాండ్ కెల్వినేటర్ పండగ సీజన్ సందర్భంగా ఫెస్టివ్ బొనంజా ఆఫర్‌ను అందిస్తోంది. ఈ నెల 31వరకూ ఉండే ఈ ఆఫర్లో భాగంగా కెల్వినేటర్ ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారికి ఆకర్షణీయమైన బహుమతులనిస్తున్నామని కెల్వినేటర్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ ధరల రేంజ్‌ల్లో ఫ్రిజ్‌లు, వాషింగ్మెషీన్లు అందిస్తున్నామని కెల్వినేటర్ మార్కెటింగ్ హెడ్ హరీశ్ మరాతే పేర్కొన్నారు. ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు. గత ఏడాది ఈ తరహా ఆఫర్‌తోనే పండుగ సీజన్లో అమ్మకాల్లో 40 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు. 190 లీటర్లకు మించిన ఫ్రిజ్‌ల కొనుగోళ్లపై రూ.1,900 విలువైన ఫ్లోర్ మాప్‌ను, సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ల కొనుగోళ్లపై రూ.1,399 విలువైన స్టీమ్ ఐరన్‌ను అందిస్తున్నామని వివరించారు.