సాధారణంగా.. మొబైల్ రీఛార్జ్ చేసేటప్పుడు డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు అదనంగా ఏమైనా ప్రయోజనాలు లభిస్తాయా?, అని చాలామంది చూస్తుంటారు. అలాంటి వారి కోసం దేశీయ టెలికాం దిగ్గజం.. రిలయన్స్ జియో అందిస్తున్న రూ.299 రీఛార్జ్ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది.
జియో అందించే.. రూ.299 రీఛార్జ్ ద్వారా 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంది. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఇందులో రోజుకు 1.5జీబీ డేటా చొప్పున మొత్తం 42 జీబీ డేటా లభిస్తుంది. దీనితో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు కూడా పొందవచ్చు. అదనంగా జియోటీవీ, జియోఏఐక్లౌడ్ సబ్‌స్క్రిప్షన్లు కూడా ఈ ప్లాన్‌లో ఉన్నాయి.
రోజువారీ డేటా పూర్తయిన తరువాత.. ఇంటర్నెట్ వేగం 64 Kbpsకు తగ్గుతుంది. కాబట్టి ఎక్కువగా వీడియోలు చూసేవారు, రోజంతా ఇంటర్నెట్ ఉపయోగించేవారు తమ డేటా అవసరాలను బట్టి ఈ ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది.
సాధారణంగా మొబైల్ రీఛార్జ్‌తో పాటు AI సేవలను కూడా ఉపయోగించాలనుకునేవారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, కంటెంట్ క్రియేటర్లు జెమిని వంటి ఏఐ టూల్స్‌ను తమ రోజువారీ పనుల్లో ఉపయోగించుకోవచ్చు.
ఇదీ చదవండి: చాట్‌జీపీటీ సాయం.. సివిల్ సర్వీసెస్‌లో విజయం!


