జియో ఐపీఓ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన ముకేశ్ అంబానీ | Reliance Jio IPO by First Galf of 2026 Says Mukesh Ambani | Sakshi
Sakshi News home page

జియో ఐపీఓ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన ముకేశ్ అంబానీ

Aug 29 2025 4:24 PM | Updated on Aug 29 2025 5:25 PM

Reliance Jio IPO by First Galf of 2026 Says Mukesh Ambani

ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో.. 2026 ప్రథమార్థంలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం దాఖలు చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'ముఖేష్ అంబానీ' ప్రకటించారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వెల్లడించారు.

2026 ప్రథమార్థం నాటికి జియోను లిస్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇది అన్ని పెట్టుబడిదారులకు చాలా ఆకర్షణీయమైన అవకాశంగా ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని ముకేశ్ అంబానీ అన్నారు. అంతే కాకుండా జియో ఇప్పుడు విదేశాలలో కూడా తన కార్యకలాపాలను విస్తరించి.. సొంతంగా ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేస్తుందని ఆయన ప్రకటించారు.

50 కోట్ల యూజర్లు
రిలయన్స్ జియో ఇప్పటికి 500 మిలియన్స్ లేదా 50 కోట్ల యూజర్లను కలిగి ఉంది. మరో వారంలో జియో ప్రారంభమైన 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇది జియో ఫ్యామిలీ సాధించిన విషయం. ఇది చాలా గర్వంగా ఉందని ముకేష్ అంబానీ అన్నారు. జియో తన సేవలను దేశంలో విస్తృతంగా అందిస్తోంది. నేడు లక్షలాది మంది భారతీయులు ఈ సేవలను పొందుతున్నారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement