నిరుద్యోగులకు అలర్ట్,'సాఫ్ట్​వేర్' కొలువుల జాతర! | Reliance Backed Fynd Plans To Hire Additional 2,000 | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు అలర్ట్,'సాఫ్ట్​వేర్' కొలువుల జాతర!

Jun 22 2022 2:17 PM | Updated on Jun 22 2022 2:17 PM

Reliance Backed Fynd Plans To Hire Additional 2,000 - Sakshi

ముంబై: ఓమ్నీ చానల్, మల్టీ ప్లాట్‌ఫామ్‌ టెక్నాలజీ సంస్థ ఫైండ్‌.. 2022–23 నాటికి 2,000 మంది ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. ఇందులో 800 మంది ఇంజనీర్లు దక్షిణాది నుంచి ఉంటారని తెలిపింది. ఈ సంస్థ బెంగళూరులో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక్కడే ఎక్కువ మందిని నియమించుకోనున్నట్టు పేర్కొంది.

ఈ సంస్థ రిలయన్స్‌ గ్రూపులో భాగం. ప్రస్తుతం 750 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇందులో సగం మందిని గత ఆరు నెలల్లోనే నియమించుకోవడం గమనార్హం. వృద్ధిని కొనసాగించేందుకు వీలుగా ఉద్యోగులను పెంచుకోనున్నట్టు తెలిపింది.   

Advertisement
 
Advertisement
Advertisement