కేంద్ర ప్రభుత్వం ఆధ్వరంలో రియాలిటీ షో.. ఎందుకోసమంటే ?

Reality Show Aims To Funding Startups To Come Up With Unique Ideas - Sakshi

స్టార్టప్‌లకు నిధుల కోసం రియాలిటీ షో 

ఆవిష్కరించిన నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌   

న్యూఢిల్లీ: వినూత్నమైన ఐడియాలున్న స్టార్టప్‌ల నిధుల సమీకరణకు ఊతమిచ్చే విధంగా ప్రత్యేక రియాలిటీ షోను నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ సోమవారం ఆవిష్కరించారు. ‘హార్సెస్‌ స్టేబుల్‌ – జో జీతా వహీ సికందర్‌‘ పేరిట ఈ షోను రూపొందించారు. స్టార్టప్‌లు, చిన్న.. మధ్య తరహా సంస్థలు తమ ఐడియాలను వివరించి, పెట్టుబడులను అందిపుచ్చుకునేందుకు ఇది తోడ్పడగలదని కాంత్‌ పేర్కొన్నారు. స్టార్టప్‌లకు తోడ్పాటునిచ్చేందుకు పరిశ్రమ దిగ్గజాలు ముందుకు రావడం హర్షణీయమని ఆయన తెలిపారు.

హెచ్‌పీపీఎల్‌ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ అగర్వాల్, బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కలిసి ఈ షోను రూపొందించారు. అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ (మిషన్‌ డైరెక్టర్‌) చింతన్‌ వైష్ణవ్, సునీల్‌ శెట్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరైన ఇన్వెస్టరు నుంచే నిధులు సమకూర్చుకోవడం, తగిన భాగస్వాములే.. వ్యాపార వృద్ధికి దోహదపడగలవని చింతన్‌ వైష్ణవ్‌ పేర్కొన్నారు.   
 

చదవండి: ఐఐటీ హైదరాబాద్‌..స్టార్టప్‌ల కోసం స్పెషల్‌ ఫండ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top