ఆర్‌బీఐ పాలసీ, గణాంకాలు కీలకం | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ పాలసీ, గణాంకాలు కీలకం

Published Mon, Apr 1 2024 8:23 AM

RBI policy and statistics are key - Sakshi

  ప్రపంచ పరిణామాలు, ఎఫ్‌ఐఐల పెట్టుబడులపై దృష్టి 

  సానుకూలతలు కొనసాగే వీలు  

  ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా 

ముంబై: ఆర్‌బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. 

దాదాపు నెల రోజుల స్థిరీకరణ తర్వాత గతవారంలో ఐటీ మినహా అన్ని రంగాల షేర్లూ రాణించాయి. ఫలితంగా ట్రేడింగ్‌ 3 రోజులే గతవారంలో సెన్సెక్స్‌ 819 పాయింట్లు, నిఫ్టీ 213 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.   

‘‘లార్జ్‌ క్యాప్‌ షేర్ల రాణించవచ్చనే ఆశలతో స్టాక్‌ మార్కెట్లో సానుకూలతలు కొనసాగొచ్చు. సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రభుత్వ కేంద్రీకృత షేర్లపై దృష్టి సారించవచ్చు. అలాగే మార్చి వాహన విక్ర య డేటా వెల్లడి కానునడంతో ఆటో షేర్లలో కదలికలు అధికంగా ఉండొచ్చు. అనుకున్నట్లే సానుకూలతలు కొనసాగే నిఫ్టీ 22,800 – 23,000 శ్రేణిలో కదలాడుతుంది. దిగువు స్థాయిలో 22,000 వద్ద తక్షణ మద్దతు ఉంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్‌ సీని యర్‌ సాంకేతిక నిపుణులు ప్రవేశ్‌ గౌర్‌ తెలిపారు. 

స్థూల ఆర్థిక గణాంకాలు 
మార్చి నెలకు సంబంధించిన వాహన విక్రయ గణాంకాలు నేడు(సోమవారం), తయారీ పీఎంఐ డేటా మంగళవారం, సేవల రంగ పీఎంఐ గణాంకాలు గురువారం వెల్లడి అవుతాయి. మార్చి 22తో ముగిసిన బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలతో మార్చి 29తో వారంలో ముగిసిన పాటు ఫారెక్స్‌ నిల్వలను ఆర్‌బీఐ శుక్రవారం విడుదల చేస్తుంది. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. 

రేట్ల కోత ఉండకపోవచ్చు  
ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ఏప్రిల్‌ 3న(బుధవారం) ప్రారంభమై, శుక్రవారం ముగియనుంది.  రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇంకా ఐదుశాతానికి పైగా కొనసాగుతుండటంతో ఈసారీ వడ్డీరేట్ల కోతకు అవకాశాల్లేవని నిపుణులు అంచనావేస్తున్నారు. అయితే ద్రవ్య పాలసీ వెల్లడి సందర్భంగా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వ్యాఖ్యలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. 

ప్రపంచ పరిణామాలు  
చైనా, జపాన్, అమెరికా మార్చి తయారీ రంగ పీఎంఐ డేటా సోమవారం, ఇవే దేశాలకు సంబంధించిన సేవల రంగ పీఎంఐ గణాంకాలు బుధవారం వెల్లడి కానున్నాయి. ఇక యూరోజోన్‌ మార్చి తయారీ రంగ  మంగళవారం విడుదల కానున్నాయి. యూఎస్‌ ఫెడరల్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ ప్రసంగం బుధవారం ఉంది. యూరోజోన్‌ సేవల రంగ డేటా గురువారం విడుదల అవుతుంది. వారాంతపు రోజైన శుక్రవారం జపాన్‌ మార్చి గృహ వినియోగ వ్యయ డేటా, యూరోజోన్‌ మార్చి రిటైల్‌ అమ్మకాలు, అమెరికా మార్చి నిరుద్యోగ గణాంకాలు విడుదల కానున్నాయి. 
 

Advertisement
Advertisement