వీటి పనితీరు ఎలా ఉందో? తయారీ, సేవల రంగాలపై ఆర్‌బీఐ కన్ను!

RBI Outlook Survey for the current quarter about manufacturing, business sentiment  - Sakshi

ముంబై:తయారీ, సేవల రంగాలకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం రెండు కీలక సర్వేలను ఆవిష్కరించింది. క్లుప్తంగా వీటిని పరిశీలిస్తే...తయారీ రంగం పనితీరును మదింపు చేయడానికి త్రైమాసిక (జూలై–సెప్టెంబర్‌) పారిశ్రామిక అవుట్‌లుక్‌ సర్వే (ఐఓఎస్‌) ప్రారంభమైంది.  
సేవలు, మౌలిక రంగాలకు సంబంధించి ప్రస్తుత త్రైమాసిక (జూలై–సెప్టెంబర్‌) పనితీరును తెలుసుకునేందుకు సేవలు, మౌలికరంగ అవుట్‌లుక్‌ సర్వే (ఎస్‌ఐఓఎస్‌)ను ఆర్‌బీఐ ప్రారంభమైంది.  
సేవలు, తయారీ,  మౌలిక రంగాలు జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లలో ఏ విధంగా పనితీరును కనబరుస్తున్నాయి?, వ్యాపార సెంటిమెంట్‌ ఎలా ఉంది?, డిమాండ్, ఫైనాన్షియల్, ఉపాధి అవకాశాలు, ధరల పరిస్థితి ఏమిటి? వంటి అంశాలపై ఈ సర్వే ప్రధానంగా దృష్టి సారిస్తుంది. తద్వారా మూడవ త్రైమాసికం (అక్టోబర్‌–డిసెంబర్‌) పరిస్థితిపై ఒక అంచనాలకు వస్తుంది.  
  కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో సేవలు, తయారీ, మౌలిక రంగాలు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్న సంగతి తెలిసిందే.  
భారత్‌ మొత్తం ఆర్థిక వ్యవస్థ (ఎకానమీ)లో సేవల రంగం వాటా దాదాపు 55 శాతంకాగా, తయారీ రంగం వాటా దాదాపు 15 శాతం.    

చదవండి: ఈ రెండు రంగాల్లో పెట్టుబడులు పెరిగాయి, కారణం ఇదేనా

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top