ఆర్‌బీఐ మొబైల్‌ యాప్‌ | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ మొబైల్‌ యాప్‌

Published Wed, May 29 2024 12:25 AM

RBI Launches Mobile App For Retail Direct and Fintech Repository And Pravaah Portal

ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడుల కోసం 

నియంత్రణపరమైన అనుమతుల కోసం ప్రవాహ్‌ పోర్టల్‌

ఆవిష్కరించిన రిజర్వ్‌ బ్యాంక్‌

ముంబై: రిటైల్‌ మదుపుదార్లు ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయడాన్ని సులభతరం చేసే దిశగా రిజర్వ్‌ బ్యాంక్‌ మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించింది. దీనితో పాటు నియంత్రణపరమైన అనుమతులకు సంబంధించి ప్రవాహ్‌ పోర్టల్, ఫిన్‌టెక్‌ సంస్థల డేటా కోసం ఫిన్‌టెక్‌ రిపాజిటరీని ప్రారంభించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మంగళవారం ఈ మూడింటిని ఆవిష్కరించారు. ప్రస్తు తం చిన్న ఇన్వెస్టర్లు రిటైల్‌ డైరెక్ట్‌ పోర్టల్‌ ద్వారా గవర్నమెంట్‌ సెక్యూరిటీస్‌ (జీ–సెక్‌)లో ఇన్వెస్ట్‌ చేయడానికి వీలుంది. ఇందుకోసం రిటైల్‌ డైరెక్ట్‌ స్కీము కింద ఆర్‌బీఐ వద్ద రిటైల్‌ డైరెక్ట్‌ గిల్ట్‌ అకౌంటును తెరవాల్సి ఉంటోంది. దీన్ని ఆండ్రాయిడ్‌ యూజర్లు ప్లే స్టోర్‌ నుంచి, ఐవోఎస్‌ యూజర్లు యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

60 ఫారంలతో ప్రవాహ్‌.. 
నియంత్రణ సంస్థపరమైన వివిధ రకాల అనుమతులకు సంస్థలు, వ్యక్తులు దర ఖాస్తు చేసుకునేందుకు ప్రవాహ్‌ పోర్టల్‌ ఉపయోగపడుతుంది. వివిధ విభాగాలకు సంబంధించి ఇందులో 60 అప్లికేషన్‌ ఫారంలు ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని పెంచనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. అప్లై చేసుకున్న వారు నిర్దిష్ట దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు, అలాగే దానిపై తీసుకున్న నిర్ణయాన్ని నిర్ణీత వ్యవదిలో దరఖాస్తుదారుకు తెలియజేసేందుకు ఉపయోగపడుతుంది.  

ఫిన్‌టెక్‌ రిపాజిటరీ.. 
ఫిన్‌టెక్‌ సంస్థలు, వాటి కార్యకలాపాలు, టెక్నాలజీపరంగా చేకూరే ప్రయోజనాలు మొదలైన డేటాకి ఈ రిపాజిటరీ కేంద్రంగా ఉంటుంది. ఫిన్‌టెక్‌ కంపెనీలను నియంత్రణ సంస్థ కోణంలో మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు, వాటికి తగిన విధానాలను రూపొందించేందుకు ఇది ఉపయోగపడగలదు. నియంత్రిత సంస్థలు, ఆర్‌బీఐ నియంత్రణలో లేని ఫిన్‌టెక్‌లు కూడా ఈ రిపాజిటరీకి సమాచారం సమరి్పంచవచ్చు.

మరోవైపు, ఆర్‌బీఐ నియంత్రణలో మాత్రమే ఉన్న సంస్థలు (బ్యాంకు లు, బ్యాంకింగ్‌యే తర ఆర్థిక సంస్థలు) వర్ధమాన టెక్నాలజీలను అందిపుచ్చుకోవడానికి సంబంధించిన వివరాల కోసం ఎంటెక్‌ (ఈఎంటెక్‌) రిపాజిటరీని కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఫిన్‌టెక్, ఎంటెక్‌ రిపాజిటరీలను ఆర్‌బీఐ అనుబంధ సంస్థ రిజర్వ్‌ బ్యాంక్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ (ఆర్‌బీఐహెచ్‌) నిర్వహిస్తుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement