జాతీయ, అంతర్జాతీయ ఎకానమీపై ఆర్‌బీఐ చర్చ

 RBI central board reviews economic situation, global developments  - Sakshi

హైదరాబాద్‌లో 601వ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ భేటీ  

హైదరాబాద్‌: జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సమీక్షించింది. సవాళ్లను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ 601వ సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో సెంట్రల్‌ బోర్డు డైరెక్టర్లు సతీష్‌ కే మరాఠే, సచిన్‌ చతుర్వేది, పంకజ్‌ రామన్‌భాయ్‌ పటేల్, రవీంద్ర హెచ్‌ ధోలాకియా పాల్గొన్నారు.

డిప్యూటీ గవర్నర్లు  మహేష్‌ కుమార్‌ జైన్, మైఖేల్‌ దేబబ్రత పాత్ర, ఎం రాజేశ్వర్‌ రావు, టీ రబీ శంకర్‌లు కూడా హాజరయ్యారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్, ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్‌ జోషిలూ సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరం ఆర్‌బీఐ చర్యలపై సమీక్ష జరపడంతోపాటు, 2023–24 అకౌంటింగ్‌ ఇయర్‌ బడ్జెట్‌ను ఆమోదించింది. అంతర్జాతీయంగా బ్యాంకింగ్‌ సంక్షోభం, అయినప్పటి కీ అమెరికా, ఈయూ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌సహా పలు దేశాలు కీలక రేట్ల పెంపు బాటలోనే ఉన్న నేపథ్యంలో తాజా సమావేశం జరిగింది. కాగా, భారత్‌ బ్యాంకింగ్‌ పటిష్టతపై విధాన నిర్ణేతలు, నిపుణులు ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top