కొత్త లగ్జరీ కారు కొన్న పుష్ప నటుడు - ధర ఎంతైనా తగ్గేదేలే! | Fahadh Faasil Buys New Land Rover Defender SUV; Check Price - Sakshi
Sakshi News home page

ఖరీదైన కారు కొన్న పుష్ప నటుడు - ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

Aug 25 2023 5:54 PM | Updated on Aug 25 2023 6:11 PM

Pushpa actor Fahadh Faasil New Land rover price and details - Sakshi

ప్రముఖ మలయాళ నటుడు 'ఫహద్ ఫాసిల్' పేరు తెలియకపోయినా.. 'పార్టీ లేదా పుష్పా' అనే డైలాగ్ వింటే మాత్రం వెంటనే ఆయనెవరో గుర్తొచ్చేస్తుంది. అంతగా పాపులర్ అయిన నటుడు ఇటీవల ఒక ఖరీదైన కారుని కొనుగోలు చేసాడు. దీని ధర ఎంత? ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఫహద్ ఫాసిల్ కొనుగోలు చేసిన కారు 'ల్యాండ్ రోవర్' (Land Rover) కంపెనీకి చెందిన 'డిఫెండర్' అని తెలుస్తోంది. ఇటీవల వారి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా ఈ కారు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ధర రూ. 2.11 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇప్పటికే ఈ కారు అర్జున్ కపూర్, ప్రకాష్‌రాజ్, ఆయుష్ శర్మ, సన్నీ డియోల్, సునీల్ శెట్టి వంటి చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఉంది.

గోండ్వానా స్టోన్ పెయింట్ స్కీమ్ కలిగిన ఈ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది భారతీయ మార్కెట్లో డిఫెండర్ 130, డిఫెండర్ 110 & డిఫెండర్ 90 అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఫహద్ ఫాసిల్ డిఫెండర్ 90 కొనుగోలు చేసినట్లు చిత్రాల ద్వారా తెలుస్తుంది. ఇది కూడా మూడు డోర్లు కలిగిన వేరియంట్.

ఇదీ చదవండి: రూ. 76000 మ్యాక్‌బుక్‌ ఆర్డర్ చేస్తే.. వచ్చింది ఇదా? ఖంగుతిన్న కస్టమర్!

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 వేరియంట్ 5.0 లీటర్ వి8 ఇంజన్‌ కలిగి 296 హార్స్ పవర్ & 650 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పనితీరు పరంగా అద్భుతమైన ఈ కారు వాహన వినియోగదారులకు ఉపయోగపడే దాదాపు అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇప్పటికే ఫహద్ ఫాసిల్ లంబోర్ఘిని ఉరస్, మినీ కంట్రీమ్యాన్, పోర్షే 911 కారెరా ఎస్ స్పోర్ట్స్‌ వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement