స్థిరాస్తులు.. డాక్యుమెంట్లు-1: అన్నీ పక్కాగా ఉంటేనే..

properties and documents expert advice - Sakshi

ఏ వ్యవహారమైనా కాగితాలు ముఖ్యం. వ్యవహారాన్ని మొదలుపెట్టిన దగ్గర్నుంచి పూర్తి చేసే వరకు ప్రతి స్థాయిలో, ప్రతి దశలో, ప్రతి అంశానికి సంబంధించిన కాగితాలు.. అవేనండి.. డాక్యుమెంట్లు అవసరం. అవేమిటో కొన్ని చూద్దాం.. 

కొనే ముందు డాక్యుమెంట్లు.. 

 • స్థిరాస్తి డాక్యుమెంట్లలో అతి ముఖ్యమైనవి అమ్మకానికి సంబంధించిన దస్తావేజులు. అమ్మే వ్యక్తి ఆ ఆస్తిని ఎలా కొన్నారు? తను కొన్నట్లు ధృవీకరించే దస్తావేజులు. 
 • అమ్మకం ద్వారా లేదా మరే ఇతర మార్గంలో హక్కు ఏర్పడ్డా, దానికి సంబంధించిన కాగితాలు. ఉదాహరణకు, వీలునామా లేదా గిఫ్ట్‌ డీడ్‌. ఈ రెండింటినీ టైటిల్‌ డీడ్స్‌ అంటారు. వీటి ద్వారానే మీకు ఆస్తి అమ్మే వ్యక్తికి అమ్మే హక్కు సంక్రమించినట్లు తెలుస్తుంది. ఆస్తి తనదా కాదా అని తెలుస్తుంది. ఇవి ఒరిజినల్‌ అయి ఉండాలి. 
 • లింకు డాక్యుమెంట్లు చూడాలి. మీకు అమ్మే వ్యక్తి, సదరు అసెట్‌ను కొనుక్కోవడానికి ముందు ఓనర్‌ ఎవరు? ఆ ఓనర్‌కి ఆస్తి ఎలా సంక్రమించింది? ఇది చాలా ముఖ్యం. 
 • సబ్‌ రిజిస్ట్రార్‌ లేదా పంచాయతీ/గ్రామ వ్యవస్థలో ఉండే రికార్డులు .. వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో ఉంటాయి. పహాణీ/ఖాతా.. సర్వే నంబర్లు, ఉప సర్వే నంబర్లు, సరిహద్దులు మొదలైనవి ఉంటాయి. 
 • మ్యుటేషన్‌ డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డుల్లో స్థిరాస్తిలో పేరు మార్పిడి, టైటిల్‌ మార్పునకు సంబంధించిన పత్రాలు, ప్రస్తుతం మీకు అమ్మే వ్యక్తి పేరు మ్యుటేషన్‌ పత్రంలో ఉండాలి. 
 • ఫ్లాట్‌ అయితే జాయింటు డెవలప్‌మెంటు అగ్రిమెంటు కాపీలు ఉండాలి. ఈ అగ్రిమెంటు ద్వారా హక్కుల సంక్రమణ జరుగుతుంది. 
 • జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ. ఒక్కొక్కప్పుడు ఓనరు ఒకరు కాగా, అమ్మకానికి హక్కులు వేరే వ్యక్తికి ఇస్తారు. పవర్‌ ఉన్న వాళ్లు అమ్మాలి. 
 • బిల్డింగ్‌ ప్లాను. అనుమతి పొందిన ప్లాను. సంబంధిత అధికారులు జారీ చేసినది. 
 • సంబంధిత అధికారులు జారీ చేసిన ఎన్‌వోసీ. అలాగే విద్యుత్‌ శాఖ, నీటి శాఖ మొదలైన శాఖలు ఇచ్చినవి. 
 • ఒరిజినల్‌ అగ్రిమెంటుకు జరిగిన మార్పులు, చేర్పులు, కూర్పులకు సంబంధించిన సప్లిమెంటరీ అగ్రిమెంటు లేదా వాటిని ఒప్పుకుంటున్నట్లు ఒప్పందం. 
 • అలాట్‌మెంట్‌ లెటర్‌. కట్టడానికి రాసుకున్న అగ్రిమెంటు, బిల్డర్‌ ఫ్లాటును అప్పగించినట్లు పత్రం, వీలుంటే అమ్మే వ్యక్తి తను కొన్నప్పుడు చేసిన చెల్లింపుల కాగితాలు, రశీదులు. 
 • మీరు కొంటున్న స్థిరాస్తిని ఆ ఓనరు బ్యాంకు నుండి అప్పు తీసుకుని కొని ఉంటే తత్సంబంధ కాగితాలు. 
 • మున్సిపల్‌ పన్నులు, కరెంటు బిల్లులు, వాటర్‌ బిల్లులు, ఇతర పెనాల్టీలు, చెల్లింపులు,  ఆఖ కాగితాలు, చెల్లింపుల రశీదులు, సొసైటీ మెంబర్‌షిప్‌ కాగితాలు, వారిచ్చే ధృవీకరణ పత్రాలు. 
 • సబ్‌–రిజిస్ట్రార్‌ నుండి ఒరిజినల్‌  ఉఇ. వీలున్నంతవరకు ఎన్ని సంవత్సరాల దాకానైనా వెళ్లండి. అలాగే 2001 ఏప్రిల్‌ 1 నాటి మార్కెట్‌ వేల్యు సర్టిఫికెట్టు, దానితో పాటు తాజాది అంటే మీరు కొనే నాటికి స్థిరాస్తి మార్కెట్‌ వేల్యుయేషన్‌ సర్టిఫికెట్‌ చూసుకోండి.  

పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్‌కు పంపించగలరు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top