
హైదరాబాద్: ఎంటర్‌టైన్‌మెంట్ రంగ దిగ్గజం సోనికి చెందిన ఓటీటీ విభాగం సోని లివ్ తెలుగు కంటెంట్, డిజిటల్ విభాగం హెడ్‌గా ప్రముఖ టాలీవుడ్ దర్శక, నిర్మాత మధుర శ్రీధర్ నియమితులయ్యారు. సోనిలివ్ తెలుగు విభాగం విస్తరణ ప్రణాళికల అమలుపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. దక్షిణాది మార్కెట్లో తమ కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు ఆయన అనుభవం తోడ్పడగలదని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ తదితర టెక్ దిగ్గజాల్లో దాదాపు 11 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన శ్రీధర్.. ఆ తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెట్టారు. మధుర ఆడియో సంస్థను నెలకొల్పారు. పలు తెలుగు చిత్రాలకు దర్శక, నిర్మాతగా కూడా వ్యవహరించారు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియషన్, తెలుగు నిర్మాతల మండలి మొదలైన వాటిలో ఆయన సభ్యులుగా ఉన్నారు.
చదవండి : కండీషన్స్ అప్లై, నెట్ ఫ్లిక్స్ లో సినిమాల్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు