కుబేరులకు చురకలు.. భూమి గాయాలని పట్టించుకోండంటూ పిలుపు

Prince William Sharp Attack On Space Tourism - Sakshi

అంతరిక్ష పర్యాటకం.. ఇప్పుడు దీని మీదే ప్రపంచ అపర కుబేరుల ఫోకస్​ ఉంది. వరుస ప్రయోగాలతో ప్రపంచానికి ఈ టూరిజం మీద నమ్మకం కలిగించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎవరి స్ట్రాటజీలను వాళ్లు ఫాలో అవుతునారు. అయితే ఈ వ్యవహారంపై Duke of Cambridge ప్రిన్స్​ విలియమ్​ అసహనం వ్యక్తం చేశారు. 
 

స్పేస్​ టూరిజం మీద రెండో క్వీన్​ ఎలిజబెత్​​ మనవడు ప్రిన్స్​ విలియమ్​ మండిపడ్డాడు. 

వర్జిన్‌ గెలాక్టిక్‌, బ్లూ ఆరిజిన్‌, స్పేస్‌ ఎక్స్‌ సంస్థలు ప్రైవేటు వ్యక్తుల రోదసి యాత్రలను చేపడుతున్న విషయం తెలిసిందే..! 

ఈ క్రమంలో స్పేస్​ టూరిజం దిశగా రిచర్డ్​ బ్రాన్సన్​, జెఫ్​ బెజోస్​, ఎలన్​ మస్క్​ అడుగులు వేస్తున్నారు.

అయితే ఈ గొప్ప బుర్రలు ఆకాశం వైపు చూడడం మానేసి.. ముందుకు నేల మీద ఫోకస్ పెట్టాలంటూ ప్రిన్స్​ విలియం ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇతర గ్రహాల మీదకు వెళ్లడం, అక్కడ బతకడం లాంటి విషయాలపై దృష్టిపెట్టడం కంటే.. ముందు భూమిని పరిరక్షించుకోవడం, భూమి గాయాలను మాన్పించేందుకు  ప్రయత్నించాలని ఆయన కోరారు. 

విలువైన మేధాసంపత్తిని సంపాదన కోసం కాకుండా.. సమాజ హితవు కోసం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

వచ్చే నెలలో సీవోపీ26 క్లైమేట్​ సమ్మిట్ జరగనుంది.. ఈ నేపథ్యంలో విలియమ్​ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  

గురువారం రాత్రి బీబీసీ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు ప్రసారం అయ్యాయి. 

90 ఏళ్ల నటుడు షాట్​నర్,​ బ్లూఆరిజిన్​ అంతరిక్ష యానం పూర్తి చేసిన కొద్దిగంటలకే ప్రిన్స్​ పై వ్యాఖ్యలు చేయడం విశేషం. 

ఇక అంతరిక్ష యాత్రలతో స్పేస్‌ టూరిజంను అభివృద్ధిచేస్తున్న ధనికులపై.. మైక్రోసాఫ్ట్‌ అధినేత ఓ అమెరికన్‌ షోలో ఘాటు వ్యాఖ్యలను చేశారు.

బిల్‌ గేట్స్‌ షోలో మాట్లాడుతూ...  ‘భూమ్మీద మనం ఎన్నో సమస్యలతో సతమతమౌతుంటే...రోదసీ యాత్రలపై దృష్టి పెట్టడం సరికాదన్నారు. 

మలేరియా, హెచ్‌ఐవీ లాంటి వ్యాధులుఇంకా అంతంకాలేదు. నాకు వాటిని భూమ్మీద నుంచి ఎప్పుడు రూపుమాపుతామనే భావన నన్ను ఎప్పుడు వేధిస్తూనే ఉంది. ఈ సమయంలో స్పేస్‌ టూరిజంపై  దృష్టిపెట్టడం సరి కాదని బిల్​ గేట్స్​ సందేశం ఇచ్చారు.

చదవండి: ఆ కంపెనీకి భారీగా నిధులను అందిస్తోన్న బిల్‌గేట్స్‌, జెఫ్‌బెజోస్‌..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top