Pre-Budget 2023: శుక్రవారం ప్రధాని ప్రీ బడ్జెట్‌ భేటీ!

Pre-Budget 2023: PM Narendra Modi to hold pre-Budget meeting with economists on 13 Jan 2023  - Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఆర్థివేత్తలు, వివిధ రంగాల నిపుణులతో ప్రీ బడ్జెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. నీతి ఆయోగ్‌లో జరగనున్న ఈ భేటీలో  దేశ ఆర్థిక వ్యవస్థ, వృద్ధి పురోగతికి తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై ప్రధాని చర్చించనున్నారని సీనియర్‌ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు సమాచారం. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1వ తేదీన  2023–24 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడతారని భావిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) భారత్‌ ఎకానమీ వృద్ధి రేటు 6.5–7.0 శ్రేణిలో నమోదవుతుందని అంచనా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top