దూసుకొస్తోన్న భారీ గ్రహశకలం..! భూమిని ఢీ కొట్టనుందా..! నాసా ఏమంటుంది..?

Potentially Hazardous Asteroid Will Be Closely Flying by Earth Later This Month - Sakshi

2021 ఎన్‌వై1 అనే గ్రహశకలం భూమి వైపుగా దూసుకువస్తోంది. ఈ గ్రహశకలం ఈ నెల సెప్టెంబర్‌ 22 న భూమికి అత్యంత సమీప దూరంలో  ప్రయాణించనున్నట్లు నాసా జెట్‌ ప్రొపల్షన్‌ లాబొరేటరీ వెల్లడించింది. 2021 ఎన్‌వై1 అత్యంత ప్రమాదం కల్గించే గ్రహశకలంగా నాసా గుర్తించింది. ఈ గ్రహశకలం భూమి నుంచి 1,498,113 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించనున్నట్లు నాసా అంచనావేసింది. ప్రస్తుతం ఈ గ్రహశకలం గంటకు 33660 కిలోమీటర్ల వేగంతో భూమి వైపుగా దూసుకువస్తోంది.
చదవండి: ఖగోళం ఖాతాలో మరో అద్భుతం.. చుక్కల దృశ్యాల్ని చూసి తీరాల్సిందే

2021 ఎన్‌వై1 గ్రహశకలం స్కూలు బస్సు పరిమాణంలో ఉందని నాసా వెల్లడించింది. ఈ గ్రహశకలాన్ని అపోలో క్లాస్‌ ఆస్టరాయిడ్‌గా నాసా శాస్త్రవేత్తలు వర్గీకరించారు. నాసా శాస్త్రవేత్తలు ఈ ఆస్టరాయిడ్‌ పరిమాణం సుమారు 0.127 కిమీ నుంచి 0.284 కిమీ వ్యాసంతో ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం గ్రహశకల గమనాన్ని నాసా జేపీఎల్‌ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు మానిటర్‌ చేస్తున్నారు. ఆస్టరాయిడ్‌ ప్రయాణిస్తోన్న నిర్ణీత కక్ష్యను సిములేషన్‌ ద్వారా నాసా పర్యవేక్షిస్తుంది.  

ఈ ఆస్టరాయిడ్‌ సూర్యుని చుట్టూ తిరిగి రావాడానికి సుమారు 1400 రోజులు పట్టనుంది. ఈ గ్రహశకలం మరో శతాబ్దం తరువాత భూమికి మరింత చేరువలో వచ్చే అవకాశం ఉందని నాసా వెల్లడించింది. 2021 ఎన్‌వై1 గ్రహశకల గమనాన్ని 2021 జూన్‌ 12 నుంచి నాసా పర్యవేక్షిస్తుంది.  కాగా ఈ గ్రహశకలం నుంచి భూమికి ప్రమాదం లేనప్పటికీ,  అత్యంత ప్రమాదకర గ్రహశకల కేటాగిరీలో ఈ ఆస్టరాయిడ్‌ను నాసా వర్గీకరించింది. 
చదవండి : ఆకాశంలో ఒక్కసారిగా పేలిపో​యిన రాకెట్‌....!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top