అద్భుత ఫీచర్లు, సరసమైన ధర పోకో ఎం2 | Poco M2 With Quad Rear Cameras Launched | Sakshi
Sakshi News home page

అద్భుత ఫీచర్లు, సరసమైన ధర పోకో ఎం2

Sep 8 2020 8:36 PM | Updated on Sep 8 2020 9:04 PM

Poco M2 With Quad Rear Cameras Launched - Sakshi

సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ పోకో  పోకో ఎం2  స్మార్ట్‌ఫోన్ ను ఇండియన్  మార్కెట్ లో లాంచ్  చేసింది. వర్చువల్ ఈవెంట్ ద్వారా పోకో ఎం 2 ను ఆవిష్కరించింది.  రెండు వేరియంట్లలో,  పిచ్ బ్లాక్, స్లేట్ బ్లూ, బ్రిక్ రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో  పోకో  ఎం2 స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది.  మీడియాటెక్ హీలియో జీ80ప్రాసర్, క్వాడ్ రియర్ కెమెరా, భారీ కెమెరా ప్రధాన ఫీచర్లుగా అందుబాటు ధరలో దీన్ని లాంచ్ చేసింది. 

భారతదేశంలో పోకో ఎం 2 ధర, లభ్యత
6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో  తీసుకొచ్చింది. 
బేస్ వేరియంట్ ధర రూ. 10,999 
టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 12,499. 
సెప్టెంబర్ 15 నుండి మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా  కొనుగోలు చేయవచ్చు.

పోకో ఎం2 ఫీచర్స్
6.53 అంగుళాలు స్ర్రీన్
1080x2340 పిక్సెల్స్  రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 10
మీడియాటెక్ హెలియో జి 80ప్రాసెసర్ 
6 జీబీ ర్యామ్,  64 జీబీ స్టోరేజ్
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
13+ 8+5+2మెగాపిక్సెల్ క్వాడ్  రియర్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

Advertisement
 
Advertisement
Advertisement