‘డేటా’ నిబంధనలను పాటిస్తున్నాం

PayTM says data resides in India, fully compliant with RBI rules - Sakshi

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: డేటా స్థానికతకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశించిన నిబంధనలన్నింటినీ పూర్తిగా పాటిస్తున్నామని పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (పీపీబీఎల్‌) స్పష్టం చేసింది. తమ బ్యాంక్‌ డేటా అంతా దేశీయంగానే భద్రపరుస్తున్నామని వివరించింది.  పర్యవేక్షణపరమైన లోపాల కారణంగా కొత్త ఖాతాలు తెరవొద్దంటూ పీపీబీఎల్‌ను ఆర్‌బీఐ గత వారం ఆదేశించిన నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. పీపీబీఎల్‌ సర్వర్లలోని వివరాలు చైనా సంస్థల చేతుల్లోకి వెడుతున్నాయనే వార్తలతో సోమవారం పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేరు ఒక్కసారిగా పతనమైంది.  ఈ వన్‌97 కమ్యూనికేషన్స్‌లో చైనా ఆలీబాబా గ్రూప్‌ సంస్థలకు 31 శాతం వాటాలు ఉన్నాయి. తద్వారా పీపీబీఎల్‌లో కూడా చైనా కంపెనీలకు పరోక్షంగా వాటాలు ఉన్నాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top