ప్యాసింజర్‌ వాహనాలు పెరిగాయ్‌ | Passenger Vehicle Dispatches Rise 13 PerCent In April | Sakshi
Sakshi News home page

ప్యాసింజర్‌ వాహనాలు పెరిగాయ్‌

May 15 2023 4:45 AM | Updated on May 15 2023 4:45 AM

Passenger Vehicle Dispatches Rise 13 PerCent In April - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా 2023 ఏప్రిల్‌లో కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్‌ వాహనాల సంఖ్య 3,31,278 యూనిట్లు నమోదైంది. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 13 శాతం పెరుగుదల అని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (సియామ్‌) తెలిపింది. ‘మారుతీ సుజుకీ ఇండియా గత నెలలో 1,37,320 యూనిట్లను డీలర్లకు సరఫరా చేసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో 1,21,995 యూనిట్లు నమోదైంది. హ్యుండై మోటార్‌ ఇండియా హోల్‌సేల్‌ విక్రయాలు 44,001 నుంచి 49,701 యూనిట్లకు చేరాయి. అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌లో డీలర్లకు 13,38,588 యూనిట్ల ద్విచక్ర వాహనాలు సరఫరా అయ్యాయి.

2022 ఏప్రిల్‌లో ఈ సంఖ్య 11,62,582 యూనిట్లు. మోటార్‌సైకిళ్లు 7,35,360 నుంచి 8,39,274 యూనిట్లు, స్కూటర్లు 3,88,442 నుంచి 4,64,389 యూనిట్లకు చేరాయి. త్రిచక్ర వాహనాలు రెండింతలై కోవిడ్‌ ముందస్తు స్థాయికి చేరువలో 42,885 యూనిట్లకు ఎగశాయి. ‘ఏప్రిల్‌ 2022తో పోలిస్తే అన్ని వాహన విభాగాలు గత నెలలో వృద్ధిని నమోదు చేశాయి. 2023 ఏప్రిల్‌ 1 నుండి పరిశ్రమ బీఎస్‌–6 ఫేజ్‌–2 ఉద్గార నిబంధనలకు చాలా సాఫీగా మారిందని ఇది స్పష్టంగా సూచిస్తోంది. పరిశ్రమ క్రమంగా రుతుపవనాల సీజన్‌లోకి ప్రవేశిస్తున్నందున మంచి వర్షపాతం కూడా ఈ రంగం వృద్ధిని కొనసాగించడంలో సహాయపడుతుంది’ అని సియామ్‌ ప్రెసిడెంట్‌ వినోద్‌ అగర్వాల్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement