హ్యుందాయ్‌ రూ.7,500 కోట్ల పెట్టుబడులు | Hyundai Motor India Plans ₹7,500 Crore Investment, Targets New SUVs And EVs Amid Q4 Profit Dip | Sakshi
Sakshi News home page

హ్యుందాయ్‌ రూ.7,500 కోట్ల పెట్టుబడులు

May 9 2026 4:30 PM | Updated on May 9 2026 5:08 PM

Hyundai Motor India Eyes Rs 7500 Crore Expansion Push

ఆటోమొబైల్‌ దిగ్గజం హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా.. దేశీ ప్యాసింజర్‌ వాహనాల మార్కెట్లో రెండో స్థానాన్ని తిరిగి దక్కించుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 7,500 కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేయనుంది. 45–50 శాతం భాగాన్ని కొత్త ఉత్పత్తులపై, మిగతా మొత్తాన్ని చెన్నై, పుణెలోని ప్లాంట్ల విస్తరణపై వెచ్చించనుంది. అలాగే రెండు కొత్త ఎస్‌యూవీలను ప్రవేశపెట్టనుంది. వీటిలో ఒక ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కూడా ఉంటుందని కంపెనీ ఎండీ, సీఈవో తరుణ్‌ గర్గ్‌ తెలిపారు.

క్యూ1లో లాభం 22 శాతం డౌన్‌..
గత ఆర్థిక సంవత్సరం (2025–26) నాలుగో త్రైమాసికంలో హ్యుందాయ్‌ లాభం రూ. 1,256 కోట్లుగా (కన్సాలిడేటెడ్‌గా) నమోదైంది. అంతక్రితం క్యూ4లో నమోదైన రూ. 1,614 కోట్లతో పోలిస్తే సుమారు 22 శాతం తగ్గింది. ఆదాయం రూ. 17,940 కోట్ల నుంచి రూ. 18,916 కోట్లకి పెరిగింది. వ్యయాలు రూ. 15,974 కోట్ల నుంచి రూ. 17,572 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుపై రూ. 21 డివిడెండు ప్రకటించిది. బీఎస్‌ఈలో హ్యుందాయ్‌ షేరు స్వల్పంగా పెరిగి రూ. 1,852 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement