నీతి ఆయోగ్‌ సీఈవోగా పరమేశ్వరన్‌ అయ్యర్‌ నియామకం! | Parameswaran Iyer Appointed As Niti Aayog Ceo | Sakshi
Sakshi News home page

నీతి ఆయోగ్‌ సీఈవోగా పరమేశ్వరన్‌ అయ్యర్‌ నియామకం!

Jun 24 2022 5:02 PM | Updated on Jun 24 2022 5:57 PM

Parameswaran Iyer Appointed As Niti Aayog Ceo - Sakshi

నీతి ఆయోగ్‌ సీఈవోగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పరమేశ్వరన్‌ అయ్యర్‌ నియమితులయ్యారు. ఆయన నియమాకాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగం అధికారికంగా ప్రకటించింది. పరమేశ్వరన్‌ అయ్యర్‌ రెండేళ్ల పాటు నీతి ఆయోగం సీఈవోగా కొనసాగనున్నారు.  

1981 ఉత్తరప్రదేశ్‌ కేడర్‌కు చెందిన పరమేశ్వరన్‌ అయ్యర్‌ పారిశుద్ధ్య నిపుణుడిగా గుర్తింపు పొందారు. 2009లో ఐఏఎస్​ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన.. ఐక్యరాజ్యసమితిలో సీనియర్‌ గ్రామీణ నీటి పారుదల, పారిశుద్ధ్య నిపుణుడిగా పని చేశారు.


ఆ తర్వాత 2016లో భారత్‌కు తిరిగి వచ్చారు. వెంటనే డ్రింకింగ్ అండ్ శానిటేషన్ విభాగానికి అధిపతిగా కేంద్రం నియమించింది. అంతకు ముందు 2014లో కేంద్రం ప్రవేశ పెట్టిన స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు నాయకత్వం వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement