ఓయో ఖాతాలో డైరక్ట్‌ బుకర్‌

OYO Takeover Europe Direct Booker Travel Company - Sakshi

కరోనా తగ్గుముఖం పట్టి ప్రపంచ వ్యాప్తంగా విహార యాత్రలకు డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో యూరప్‌లో మరింత బాగా పాగా వేసే పనిలో ఉంది ఓయో. యూరప్‌కి చెందిన ట్రావెల్‌ టెక్‌ ఫర్మ్‌ డైరక్ట్‌ బుకర్‌ అనే సంస్థను కొనుగోలు చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీని కోసం ఓయో రూ. 40 కోట్లను వెచ్చించనుంది. డైరెక్ట్‌ బుకర్‌ ఓయో ఖాతాలో చేరడం వల్ల యూరప్‌లోని క్రోయేషియాలో కూడా ఓయో రూములు లభించే వెసులుబాటు కలుగుతుంది.

యూరప్‌లో సుస్థిర స్థానం సాధించేందుకు ఓయో ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బెల్‌విల్లా, ట్రామ్‌.. వంటి టెక్‌ ట్రావెల​ కంపెనీలు సొంతం చేసుకుంది. వీటి ద్వారా నెదర్లాండ్స్‌, డెన్మా‍ర్క్‌, బెల్జియం, జర్మనీ, ఆస్త్రియా వంటి దేశాల్లో సర్వీసులు అందిస్తుంది. కొత్త డీల్‌ ద్వారా క్రోయేషియా కూడా ఈ జాబితాలో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 1.40 లక్షల హోం స్టోర్‌ఫ​‍్రంట్స్‌ సాధించడం తమ లక్ష్యంగా ఓయో సీఈవో రితేశ్‌ అగర్వాల్‌ తెలిపారు. 

చదవండి: ఒకప్పుడు స్టార్టప్‌ల అడ్డా .. ఇప్పుడు యూనికార్న్‌ల రాజ్యం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top