'Outright lie, no one was raided or sent to jail': Union Minister Denied the Allegations Made by Former Twitter CEO Jack Dorsey
Sakshi News home page

Twitter Ex CEO: జాక్ డోర్సే వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. అన్నీ అవాస్తవాలే అంటూ..

Jun 13 2023 10:50 AM | Updated on Jun 13 2023 6:14 PM

'Outright lie, no one was raided or sent to jail': Union Minister Denied the Allegations Made by Former Twitter CEO Jack Dorsey - Sakshi

Rajeev Chandrasekhar Vs Jack Dorsey: మాజీ ట్విటర్ సీఈఓ 'జాక్ డోర్సే' (Jack Dorsey) భారత ప్రభుత్వంపై కొన్ని ఆరోపణలు చేశారు. ఇందులో తమ బృందానికి షట్‌డౌన్ మాత్రమే కాకుండా వారి ఇళ్లపై కూడా దాడులు జరుగుతాయని బెదిరింపులు వచ్చినట్లు వెల్లడించాడు. ఈ ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని కేంద్ర మంత్రి 'రాజీవ్ చంద్రశేఖర్' స్ఫష్టం చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సెంట్రల్ స్కిల్ డెవలప్‌మెంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. జాక్ డోర్సే చేసిన ప్రకటనలు పూర్తిగా అవాస్తవాలని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ట్విటర్ బృందం మీద ఎవరూ దాడి చేయలేదని, జైలుకి పంపలేదని స్పష్టం చేసారు. అంతే కాకుండా డోర్సే, అతని బృందం భారతదేశ చట్టాన్ని పదేపదే ఉల్లంఘించిందని 2020 నుంచి 2022 వరకు ఇదే పద్దతిని పాటించినట్లు చెప్పుకొచ్చాడు.

జాక్ డోర్సే భారత చట్టానికి సంబంధించిన సార్వభౌమాధికారాన్ని అంగీకరించడానికి సుముఖ చూపడంలేదని, చట్టాలు అతనికి ఏ మాత్రం వర్తించనట్లు ప్రరవర్తించారని చెప్పడమే కాకుండా, దేశంలో ఉన్న కంపెనీలన్నీ చట్టాలను తప్పకుండా అనుసరించాలాని పేర్కొన్నారు. రైతుల నిరసనను డోర్సే ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించారో కూడా చంద్రశేఖర్ వివరించారు.

నిరసనల సందర్భంగా చాలా తప్పుడు సమాచారం ప్రచారంలో ఉందని, అలాంటి తప్పుడు వార్తలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. డోర్సీ ఆధ్వర్యంలోని ట్విట్టర్ కేవలం భారతీయ చట్టాన్ని ఉల్లంఘించడమే కాదు, మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,19ని ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా, పక్షపాతంతో వ్యవహరించిందని.. తప్పుడు సమాచారాన్ని ఆయుధాలుగా చేయడంలో సహాయం చేస్తుందని అన్నారు. ప్రస్తుతం భారత ప్రభత్వం విధి విధానాలు స్పష్టంగా ఉన్నాయని.. సంస్థలు కూడా విశ్వసనీయంగా, జవాబుదారీగా వ్యవహరించాలని చంద్రశేఖర్ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement